ఈ నెల 13న విడుదలవుతున్న ‘చైతన్యం’ | Chaitanyam Movie To Release On 13th August | Sakshi
Sakshi News home page

ఈ నెల 13న విడుదలవుతున్న ‘చైతన్యం’

Published Wed, Aug 11 2021 8:16 PM | Last Updated on Wed, Aug 11 2021 8:16 PM

Chaitanyam Movie To Release On 13th August - Sakshi

కౌటిల్య, యాషిక జంటగా నటించిన చిత్రం ' చైతన్యం '.  సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి నిర్మించారు. ఫ్యామిలీ, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 13న వన్ మీడియా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది.

 ఈ సందర్బంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ ...‘దుబాయ్‌కి వెళ్లి బాగా డబ్బులు సంపాందించాలనుకున్న  ఓ యువకుడు.. అతని జీవితంలో వచ్చిన అడ్డంకులు ఎదుర్కొని ఎలా ముందుకు కదిలాడు అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. చైతన్యం లేకుంటే మనిషి బతుకు దుర్భరం అని చెప్పే ప్రయత్నం చేశాం. ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement