Kautilya
-
RBI Governor Shaktikanta Das: అధికరేటు ఎప్పటివరకో... కాలమే చెప్పాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు కొంతకాలం అధిక స్థాయిలోనే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎంతకాలం ఈ స్థితి కొనసాగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్, 2023లో ఆయన ఈ మేరకు ఒక ప్రసంగం చేస్తూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి సెంట్రల్ బ్యాంక్ జాగరూకతతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ‘ఏకాగ్రతకు సంబంధించి అర్జునిడి కన్ను’’తో పోల్చారు. భారత్‌లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ‘అంతర్జాతీయ ఇంధన ధరలే’ ప్రధాన సవాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్–గాజా సంఘర్షణ అమెరికాసహా ఇతర ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లోనూ భారత్ పటిష్ట ఆర్థిక పరిస్థితులను కలిగి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో తీవ్ర ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 2,000 నోట్లు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో రూ. 10,000 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఆ మొత్తం కూడా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇదిలావుండగా, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని గవర్నర్ నేతృత్వంలో ఈ నెల మొదట్లో జరిగిన ఆరుగురు సభ్యుల ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయించినట్లు ఆ భేటీకి సంబంధించి తాజాగా వెలువడిన మినిట్స్ పేర్కొంది. ఫిబ్రవరి తర్వాత వరుసగా నాలుగు సమీక్షా సమావేశాల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై రాజీలేని వైఖరి అవలంభిస్తామని తద్వారా కమిటీ స్పష్టం చేస్తోంది. -
ఈ నెల 13న విడుదలవుతున్న ‘చైతన్యం’
కౌటిల్య, యాషిక జంటగా నటించిన చిత్రం ' చైతన్యం '. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి నిర్మించారు. ఫ్యామిలీ, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 13న వన్ మీడియా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్బంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ ...‘దుబాయ్‌కి వెళ్లి బాగా డబ్బులు సంపాందించాలనుకున్న ఓ యువకుడు.. అతని జీవితంలో వచ్చిన అడ్డంకులు ఎదుర్కొని ఎలా ముందుకు కదిలాడు అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. చైతన్యం లేకుంటే మనిషి బతుకు దుర్భరం అని చెప్పే ప్రయత్నం చేశాం. ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని అన్నారు. -
చాణక్యుడు-జీఎస్టీ... అసలేంటి సంబంధం?
సాక్షి : బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ ప్రథమ సెమిస్టర్ పరీక్ష రాసిన విద్యార్థులు పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రం చూసి బుర్ర గోక్కున్నారు. జీఎస్టీ, గ్లోబలైజేషన్ మీద అడిగిన ప్రశ్నలే అందుకు కారణం. వాటికి చరిత్రకు ముడిపెట్టి ఓ ఫ్రొఫెసర్ గారు చేసిన ప్రయోగం విద్యార్థుల మతిపోవటానికి కారణమైంది. పుస్తకాల్లో లేని ప్రశ్నలు కనిపించటంతో ఒక్కసారిగా వాళ్లు అవాకయ్యారు. ఏం రాయాలో తెలీక బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు(చాణక్యుడు) జీఎస్టీ గురించి, ప్రపంచీకరణ గురించి మను చెప్పటం అన్నది నిజం. ఆయా పుసక్తాల్లో వాటి గురించి పరోక్ష వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి అని కౌశల్ చెబుతున్నారు. మిశ్రా ఆరెస్సెస్ కార్యకర్త కావటంతో తన సొంత ఆలోచనలను రంగరించి బోధనలో తరచూ ప్రయోగాలు నిర్వహిస్తుంటారని.. ఈ మేరకు ఆయన సొంత మెటీరియల్‌ను కూడా తమకు అందించారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఈ అంశంపై పలువురు ఫ్రొఫెసర్లు మండిపడ్డారు. తలా తోక లేని ఇలాంటి ప్రయోగాలు చేయటం సరికాదని వారు హితవు పలికారు. కాగా, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ అంశంతో తమకేం సంబంధం లేదని.. నిపుణుల పర్యవేక్షణలోనే ఆ ప్రశ్నాపత్రం తయారయ్యిందని చెప్పటం కొసమెరుపు. గత ఏప్రిల్‌లో గుజరాత్ లో ఓ పరీక్ష సందర్భంగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు రావటంతో విద్యార్థులు ఇలాగే అవాక్కయ్యారు. ఆ ఘటన అప్పట్లో రాజకీయంగా కూడా విమర్శలకు తావునిచ్చింది. -
కొత్తతరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం: ఇదం కౌటిల్యం...
మంచి పుస్తకం డబ్బు లేనిదే జగత్తు లేదు. అలాగే జగత్తు లేకపోతే డబ్బూ ఉండదు. డబ్బు ఉండాలంటే జగత్తు సక్రమమైన చక్రాల మీద నడవాలి. వ్యవస్థ సజావుగా సాగాలి. పరిపాలనా విభాగాలు తమ విధులను తు.చ. తప్పకుండా నెరవేర్చాలి. ప్రభువు వీటన్నింటినీ సమర్థంగా అజమాయిషీ చేయాలి. ప్రజలు అందుకు తోడ్పడాలి. అప్పుడే డబ్బు ఉన్న ప్రపంచమూ, ప్రపంచంలోని డబ్బూ పరస్పరం సహకరించుకుంటూ మానవ జీవనాన్ని సుఖమయం చేస్తాయి. ఇది కనిపెట్టిన పూర్వీకులు అనేక ఆర్థిక గ్రంథాలను, స్మృతులనూ రాశారు. రాజుల చేత వాటిని శాసనస్థాయిలో అమలు పరిచేలా చూశారు. అయితే క్రీ.పూ.370 కాలానికి చెందినట్టుగా భావిస్తున్న కౌటిల్యుడు తన అర్థశాస్త్రంతో వీటన్నింటి అవసరం లేకుండా చేశాడు. ఆయన తన ముందుకాలం నాటి ఆర్థిక, ప్రవర్తనా నియమావళులన్నింటినీ క్రోడీకరించి వాటిలోని ముఖ్యవిషయాలతో పాటు తాను చెప్పవలసిన విషయాలను కలిపి అర్థశాస్త్రం రచించాడని అంటారు. కౌటిల్యుడే చాణక్యుడు అని ఎక్కువమంది భావించినా ఇరువురూ వేరు వేరు అనే అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకూ కౌటిల్యుని అర్థశాస్త్రం కేవలం భారతదేశాన్నే కాదు ప్రపంచ ఆర్థిక ప్రవీణులను కూడా ఆకర్షిస్తూనే ఉంది. ప్రతీ తరం ఇందులో నుంచి గ్రహించవలసింది ఎంతో ఉంది. అందుకే ప్రసిద్ధ ఆర్థికరంగ నిపుణులు కె.నరసింహమూర్తి నేటి యువతరం కోసం కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కీలకాంశాలను సులభరీతిలో ఈ గ్రంథంలో విశదపరిచారు. ఒక ప్రముఖ దినపత్రికలో కాలమ్గా వెలువడి ఆదరణ పొందిన వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి చెబుతున్నామంటే కేవలం డబ్బు గురించి మాట్లాడుతున్నట్టుగా పొరపడరాదు. ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజారక్షణ, దేశరక్షణ, దండనీతి వీటన్నింటినీ ప్రభువులతో పాటు పౌరులు కూడా తెలుసుకొని ఎలా మసలుకోవాలో విడమర్చే శాస్త్రం ఇది అనంటారు నరసింహమూర్తి. ఇవాళ యువత పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్లడం వ్యాపార సంస్థలు నడపడం చూస్తాం. అంటే వారు రాజు/పాలక స్థానంలో ఉన్నవారి కిందే లెక్క. వీరు తమ కింద పని చేసే ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరించాలి? ‘ప్రజలు ఆనందంగా ఉంటేనే రాజు ఆనందంగా ఉంటాడు’ అంటాడు కౌటిల్యుడు. ‘న్యాయబద్ధంగా అందాల్సినవారికి అందకుండా చేసి వారిలో అసంతృప్తి పెంచడం కంటే ప్రమాదం లేదు’ అని కూడా అంటాడు. ఇవన్నీ పాఠాలు. ఇలాంటి తెలుసుకోవలసిన అనేక అంశాలను గ్రంథకర్త నరసింహమూర్తి 43 వ్యాసాలలో వివరించారు. ఈ పోటీ యుగంలో ఏ రంగంలో అయినా శత్రువులు తప్పరు. అట్టి శత్రువులతో వ్యవహరించడం ఎలాగో కూడా ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. మంచి ప్రయత్నం చేసిన నరసింహమూర్తి అభినంద నీయులు. - డి.కృష్ణమూర్తిడ ఇదం కౌటిల్యం కె.నరసింహమూర్తి (9652544432) ఎమెస్కో ప్రచురణ వెల: రూ.75 ప్రతులకు: 040 - 23264028