Krishnadasi Fame Chhavi Mittal Calls Out Troll Who Body Shames Her For Being Skinny- Sakshi
Sakshi News home page

Chhavi Mittal: నువ్వో అస్థిపంజరం, దయచేసి ఆ పని మాత్రం చేయకు

Published Thu, Jul 15 2021 1:25 PM | Last Updated on Thu, Jul 15 2021 2:01 PM

Chhavi Mittal Gets Body Shaming As Skinny - Sakshi

కృష్ణదాసి సీరియల్‌తో ప్రేక్షకులను అలరించిన చవీ మిట్టల్‌ ఈ మధ్య కాస్త సన్నబడిపోయింది. దీంతో అబ్‌ బాస్‌ అనే పేరున్న నెటిజన్‌ ఆమె మరీ బక్కగా అయిపోయిందంటూ నేరుగా నటికే మెజేస్‌ పెట్టింది. "మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. మీరు చాలా బక్కచిక్కిపోయారు. మీ చేతులు చూస్తుంటే అవి అస్థిపంజరాల్లాగా కనిపిస్తున్నాయి. డైటింగ్‌ మరీ ఎక్కువైపోతున్నట్లుంది. వృత్తిపరంగా నేనూ వైద్యురాలినే, నాకూ ఇద్దరు పిల్లలున్నారు. ఫిట్‌నెస్‌ మీద నేను కూడా శ్రద్ధ తీసుకుంటాను, కానీ దయచేసి మీరు పాటించే డైట్‌ను మాత్రం వేరొకరికి సూచించకండి" అని ఉచిత సలహా ఇచ్చింది.

ఇది చూసిన చవీ మిట్టల్‌ సదరు నెటిజన్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. "నేను పోస్ట్‌ చేసిన వీడియోల కింద వచ్చిన కామెంట్లను అలా చూసుకుంటూ వెళ్లాను. కొన్ని బాగున్నాయి, మరికొన్ని అస్సలు బాగోలేవు. డియర్‌ అబ్‌ బాస్‌, మీకో విషయం చెప్పాలనుకుంటున్నా.. ఒక మహిళగా సాటి మహిళను బాడీ షేమింగ్‌ చేయడం ఆపేయండి. నా పిల్లల కోసం, నా చుట్టూ ఉన్నవాళ్ల కోసం నా చేతులు ఎంతగానో కష్టపడ్డాయి. ఇప్పుడవి చూడటానికి 40 ఏళ్ల వయసున్న వారి చేతుల్లాగా లేదా అంతకంటే పెద్ద వయసువారిలా కనిపిస్తాయేమో!"

"కానీ నా చేతుల ద్వారా చేసే మంచి పనులు నన్నెప్పుడూ సంతోషంగా ఉంచుతాయి. లావుగా ఉన్నావనడం.. మహిళను ఎలా అగౌరవపర్చినట్లు అవుతుందో స్కిన్నీ(బక్కపలచ) అని పిలవడం కూడా అంతే అమర్యాదపర్చడమవుతుంది. ప్రియమైన తల్లులారా? మీరు కూడా ఇలాంటి బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారా?" అని తిరిగి ప్రశ్నిస్తూ పోస్ట్‌ పెట్టింది. దీంతో పలువురు మహిళా నెటిజన్లు ఓహ్‌, చాలాసార్లు ఎదుర్కొన్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు. కాగా చవీ మిట్టల్‌ 2005లో మోహిత్‌ హుస్సేన్‌ను పెళ్లాడింది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement