![Chiranjeevi And Nagarjuna Meets CM KCR At Pragathi Bhavan - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/7/KCR-chiru-nag.jpg.webp?itok=tirE70WX)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున కలిశారు. ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు గతంలో ప్రకటించిన విరాళాలకు సంబంధించిన చెక్కులను సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకులతం అయిన విషయం తెలిసిందే. వరద భాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ముందుకు వచ్చారు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ.50 లక్షలను ప్రకటించారు. వీరితో పాటు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ప్రభాస్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి చెరో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment