సాక్షి, హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్‌తో భారీగా నష్టపోయిన చిత్ర పరిశ్రమను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. త్వరలోనే థియేటర్లను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శనివారం సీఎం కేసీఆర్‌ను మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసి వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పరిశ్రమ గురించి అడిగి తెలుసుకున్నారు.
(చదవండి : సీఎం కేసీఆర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ )
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోయిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తనవంతు సాయం చేస్తుందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ సిటీ శివార్లులో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సీటీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఫిల్మ్‌సిటీ కోసం 1500-2000 ఎకరాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు త్వరలోనే బల్గేరియా ఫిల్మ్‌సిటీని పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment