Chiranjeevi Does Telangana Potharaju Dance, Video Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi: పోతరాజు స్టెప్పులేసిన చిరంజీవి.. వీడియో వైరల్‌

Published Sat, Oct 8 2022 9:21 AM | Last Updated on Sat, Oct 8 2022 11:00 AM

Chiranjeevi Does Potharaju Dance, Video Goes Viral - Sakshi

దక్షిణాది చిత్ర పరిశ్రమలో డ్యాన్స్‌కి ఓ క్రేజ్‌ తీసుకొచ్చిన హీరో చిరంజీవి.  ఆయన మెగాస్టార్‌గా ఎదగడానికి డ్యాన్స్‌ ఒక కారణం. చిరు స్టెప్పేస్తే థియేటర్స్‌ షేక్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.  ఎంత మంది యంగ్‌ హీరోలు వచ్చినా..  ఇప్పటికీ చిరు స్టెప్పేస్తే సిల్వర్‌ స్క్రీన్‌ ఊగిపోవాల్సిందే. ఆయన డ్యాన్స్‌లో అట్రాక్షన్‌ ఉంటుంది. జోష్‌ ఉంటుంది. వెండితెరపై ఎన్నో వెరైటీ స్టెప్పులేసి అలరించిన చిరు.. తెలంగాణ సంప్రదాయమైన పోతరాజుల స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్‌కైతే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు.

విజయదశమి సందర్భంగా హరియాణా గవర్నర్‌ బండారు దత్తత్రేయ ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు చిరంజీవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి చిరంజీవి పోతరాజు స్టెప్పులేశాడు.  పోతరాజుల చేతిలో ఉన్న చెర్నాకోలను పట్టుకొని అందరితో పాటు కాలు కదిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా, దసరా సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తూ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement