సాక్షి, హైదరాబాద్: యోధ లైఫ్ లైన్ వ్యవస్థాపకులు కంచర్ల సుధాకర్ మంచి సంకల్పంతో ఇంటర్నేషనల్ స్థాయిలో డయాగ్నోస్టిక్ సెంటర్ తీసురావడం ఎంతో సంతోషమని మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. జీన్ సెక్యూన్స్ చేసుకుంటే ఫ్యూచర్‌లో వచ్చే అనేక రకాల రోగాలను అంచనా వేసి జాగ్రత్తపడవచ్చని తెలిపారు. జీనోమ్ అంటే ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలని, దీని మీద అంతకుముందు తనకు అవగాహన లేదని తెలిపారు. ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ లేక అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ మేరకు తనే మొదటగా పరీక్షలకు బ్లడ్ శాంపిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్న డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి
ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులోకి రావడం అందరి ఆరోగ్యానికి బాగా పనికివచ్చే అంశమని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ తరువాత తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది వెంకయ్య నాయుడేనని ప్రస్తావించారు. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావడం తన కోరిక అని వెల్లడించారు. ఈ మద్య కాలంలో ఆరోగ్యాన్ని అందరు నెగ్లెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీలో కార్డియాక్ జీన్ ఉందని, అలాంటివి ముందే తెలుసుకొని ఉంటే ఇంత ఇబ్బంది ఆ కుటుంబానికి ఉండేది కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment