Diagnostic Center
-
రాసింది ఒకటి.. చేసింది మరొకటి.. ‘స్టార్’ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాకం
సాక్షి, అనంతపురం: నగరంలోని స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుల తీరు రోగులను ఆవేదనకు గురి చేస్తోంది. బాధితులు తెలిపిన మేరకు... మల విసర్జన సమయంలో ఇబ్బంది పడుతున్న జమ్మలమడుగుకు చెందిన ప్రకాష్‌రెడ్డి సోమవారం ఉదయం అనంతపురంలోని తన సోదరుడి కుమారుడు హరిప్రసాదరెడ్డితో కలసి ఓ ప్రైవేట్ ఆసపత్రికి వెళ్లి చూపించుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరికీ ఎంఆర్ఐ పిస్టులాగ్రామ్ లిమిట్ కట్స్ వైద్య పరీక్ష చేయించుకుని రావాలంటూ స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు డాక్టర్ ప్రణీత్‌రెడ్డి రెఫర్ చేశారు. దీంతో వారు స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్లో పేషెంట్ ఐడీ నెంః 230116–026(హరిప్రసాద్‌రెడ్డి), 230116–025(ప్రకాష్‌రెడ్డి)తో పరీక్ష చేయించుకున్నారు. ఇందుకుగాను ఇద్దరికీ కలిపి రూ.14 వేలు బిల్లు అయింది. అనంతరం రిపోర్టు తీసుకెళ్లి వైద్యుడికి చూపిస్తూ డయాగ్నస్టిక్ సెంటర్లో ఒక్కొక్కరికి రూ.7వేలు చొప్పున బిల్లు అయిందంటూ వివరించారు. దీంతో డాక్టర్ అసహనానికి గురవుతూ తాను రాసిచ్చిన పరీక్షలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.3,500 మాత్రమే అవుతుందని, రూ.7 వేలు చొప్పున ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి బాధితులు ప్రశ్నిస్తే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పంపారు. డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు తమను మోసం చేశారంటూ ఈ సందర్భంగా బాధిత రోగులు వాపోయారు. దీనిపై స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుల్లో ఒకరైన దాదాగాంధీ మాట్లాడుతూ.. డాక్టర్ సూచన మేరకు తాము వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. హరిప్రసాద్ రెడ్డికి వైద్యుడు రాసిచ్చిన టెస్టు చీటి -
వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావడం నా కోరిక: చిరంజీవి
-
వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావడం నా కోరిక: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: యోధ లైఫ్ లైన్ వ్యవస్థాపకులు కంచర్ల సుధాకర్ మంచి సంకల్పంతో ఇంటర్నేషనల్ స్థాయిలో డయాగ్నోస్టిక్ సెంటర్ తీసురావడం ఎంతో సంతోషమని మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. జీన్ సెక్యూన్స్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే అనేక రకాల రోగాలను అంచనా వేసి జాగ్రత్తపడవచ్చని తెలిపారు. జీనోమ్ అంటే ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలని, దీని మీద అంతకుముందు తనకు అవగాహన లేదని తెలిపారు. ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ లేక అనేక మంది చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ మేరకు తనే మొదటగా పరీక్షలకు బ్లడ్ శాంపిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్న డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులోకి రావడం అందరి ఆరోగ్యానికి బాగా పనికివచ్చే అంశమని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ తరువాత తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది వెంకయ్య నాయుడేనని ప్రస్తావించారు. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావడం తన కోరిక అని వెల్లడించారు. ఈ మద్య కాలంలో ఆరోగ్యాన్ని అందరు నెగ్లెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీలో కార్డియాక్ జీన్ ఉందని, అలాంటివి ముందే తెలుసుకొని ఉంటే ఇంత ఇబ్బంది ఆ కుటుంబానికి ఉండేది కాదని అన్నారు. -
మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు చిరంజీవి కలిసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, పుల్లెల గోపిచంద్, క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకులు కంచర్ల సుధాకర్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్‌ను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్ సిటీగా మారుతోందని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఒక టీచర్ అని, అది మనకు ఎన్నో పాఠాలను నేర్పుతోందన్నారు. జీవితంలో ఎప్పుడూ నెగెటివిటీ ఉండొద్దు కానీ కరోనా విషయంలో నెగెటివ్ ఉండాల్సిందేనన్నారు. పట్టణాల్లో కరోనా బాగా విజృంభించిందని, గ్రామాల్లో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. పట్టణాల్లో జీవనం, జీవన విధానం దగ్గరదగ్గరగా ఉందని, రాబోయే రోజుల్లో గాలి వెలుతురు వచ్చేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ‘గాలి వెలుతురు రాకపోతే అది ఇల్లే కాదు. ఇంటికి సౌందర్యమా, సౌకర్యమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. సౌకర్యం ఉంటేనే ఇల్లు సౌందర్యంగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. శారీరక శ్రమ చేయాలి. పిజ్జా బర్గర్ విదేశాల్లో అవసరం. విదేశాల్లో పనికొస్తాయి. మనకు ఆ తిండి పనికి రాదు. మన సంస్కృతి, మన బాషా, మన కట్టుబాట్లు అన్ని పాటించాలి. మనం ఏ స్థాయిలో ఉన్న మన డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు’. అని వ్యాఖ్యానించారు. నగరంలో ఇన్ని డైయాగ్నోస్టిక్స్ ఉన్నప్పటికీ అత్యాధునికమైన, అడ్వాన్స్ టెక్నాలజీ యోధ లైఫ్ లైన్లో ఉన్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో ఆరోగ్యానికి పెద్దపీట వేసేందుకు మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వారికి వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం తరపున తమకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాల్లో కూడా యోధ లైఫ్ లైన్ విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు కంచర్ల సుధాకర్ 25 లక్షల విరాళం ప్రకటించారు. -
Indrakaran Reddy: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన తెలంగాణ డయగ్నోస్టిక్ హబ్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లతో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. 19 జిల్లాల్లో డయగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 57 రకాల నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. రూ.2.40 కోట్లతో రిమ్స్ ఆవరణలో డయగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, విందులు, వినోదాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గతేడాది రూ.40వేల కోట్ల ఆదాయం నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లు మాట్లాడారు. జిల్లాలో నాలుగు రూట్లు ఏర్పాటు చేసి 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను తెలంగాణ డయగ్నోస్టిక్ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం పంపించడం జరుగుతుందన్నారు. వైద్యం కంటే ప్రైవేటులో నిర్ధారణ పరీక్షలకే అధిక డబ్బులు ఖర్చవుతున్నట్లు తెలిపారు. చాలా మంది అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని, పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం నిర్ధారణ పరీక్షలు తీసుకొచ్చే వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. చదవండి: Telangana: ఎంసెట్ వాయిదా! -
57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా..
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను, అలాగే రోగుల సహాయకుల కోసం విశ్రాంతి గదిని మంత్రి హరీష్‌రావు మంగళవారం ప్రారంభించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని ఆయన వెల్లడించారు. పేద ప్రజలు ఆసుపత్రికి వెళితే వివిధ రకాల పరీక్షలకు వేలల్లో డబ్బులు ఖర్చవుతుంన్నందున, ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు చేయాలని నిర్ణయించి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఆసుపత్రులను పట్టించుకునే వారు కాదని, తమ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజల కోసం ఎన్నో ఆసుపత్రులను నిర్మించి, అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ ఆసుపత్రులంటే పేద ప్రజలకు నమ్మకం ఏర్పడిందని తెలిపారు. గతంలో సిద్దిపేట ప్రజలు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకునే వారని, ఇప్పుడు సిద్దిపేటలోనే 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకునే సౌలభ్యాన్ని తమ ప్రభుత్వం కల్పించిందని మంత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం రోగి ఫోన్‌కు రిపోర్టులు మెసేజ్ రూపంలో వెళ్తాయని వివరించారు. రెండున్నర కోట్ల నిధులతో ఈ సెంటర్‌ను ప్రారంభించామని, రానున్న రోజుల్లో అల్ట్రా సౌండ్ ,ఈసీజీ వంటి పరికరాలను అందుబాటులోకి తెస్తామని, మరో వారం రోజుల్లో సిటీ స్కాన్‌ను ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు 35 వేల మందికి ప్రతి రోజు పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న పరికరాలను అందుబాటులోకి తెచ్చామని, సిద్దిపేట ప్రజలు ఈ సేవలకు వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతి చౌక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్ఐ కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు. అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డిఎస్జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్ఐ స్కాన్‌కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్‌ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్ఐ యంత్రాలు చొప్పున ఉన్నట్టు ప్రకటించారు. After a low-cost dispensary, Gurudwara Bangla Sahib is now slated to open a cheap diagnostic facility. An ultrasound will cost Rs. 150 & an MRI Scan Rs. 50! 🙏 pic.twitter.com/oZLKQblUTa — Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 5, 2020 -
అయామ్ సారీ
కొన్ని లక్షణాలు ఉంటేనే పురుషుడు. కొన్ని లక్షణాలు లేకుంటేనే ఆమె స్త్రీ! పాతుకు పోయిన నిర్ధారణ విధానం. పురుషుడు పెట్టుకున్న.. డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ సమాజం. గట్టిగా మాట్లాడుతోందా.. స్త్రీ కాదు. మనసారా నవ్వుతోందా... స్త్రీ కాదు. సలహా ఇవ్వబోయిందా.. స్త్రీ కాదు! రిపోర్ట్స్ చూశారు సృష్టీ అండ్ టీమ్. స్త్రీగా లేనందుకు... ‘సారీ’ చెప్పారు. సృష్టీ దీక్షిత్‌కు ఒక టీమ్ అంటూ లేదు! విడిగా యూట్యూబ్ కమెడియన్ ఆమె. నవ్వలేక చచ్చే సెటైర్లతో దవడల్ని చెక్కలు చేసేస్తారు. తాజాగా ఒక వీడియోను సృష్టించడం కోసం సహ కమెడియన్లతో టీమ్–అప్ అయ్యారు. ‘ఉమెన్ ఫైనల్లీ అపాలజైస్ ఫర్ ఎవ్రీథింగ్’ అనే వీడియో అది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. 2 నిముషాల 39 సెకన్ల నిడివి. ఆ మాత్రంలోనే రెండున్నర గంటల సినిమా చూపించేశారు! స్త్రీలు ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే బాగుండదో పురుషులకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటికి తగ్గట్లు లేనందుకు వీళ్లు తమని తాము నిందించుకునే ధోరణిలో పురుషులకు ఈ వీడియోలో సారీ చెబుతుంటారు! అందరూ డిజిటల్ కమెడియన్లే కానీ, ఎవర్నీ నవ్వించడానికి చేసిన వీడియో కాదు ఇది. ‘మా రెక్కలు ఎందుకు కట్టేస్తారు?’ అని అడగడం. ‘మా నోటికి టేప్ ఎందుకు వేస్తారు?’ అని ప్రశ్నించడం. ఊరికే నిలబడి దారినపోయే వాళ్ల మీద ఇంకుచుక్కల్ని చల్లే స్టాండ్–అప్ కమెడియన్లు కాదు.. సృష్టీ దీక్షిత్, డాలీ సింగ్, కుషా కపిల, మల్లికా దువా, శ్రీజా చతుర్వేది, పవిత్రాశెట్టి, విపాసనా మల్హోత్రా, త్రినేత్రా హల్దార్, సురభీ బగ్గా, స్వాతీ సచ్దేవ, సోఫియా ఆష్రాఫ్, విదూసీ స్వరూప్! స్త్రీజాతి సమస్తాన్నీ ఒక ‘ఆదర్శ మహిళ’గా తీర్చిదిద్దే పనిలో నిరంతరం వీళ్లు మాటల్ని విడుదల చేస్తూ ఉంటారు. ‘మన మీదే ఈ విరుపులు’ పురుష పుంగవులకు అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్లంతా కలిసి చేసిన సింగిల్ లైన్ స్క్రిప్టు ‘ఉమెన్ ఫైనల్లీ అపాలజైస్ ఫర్ ఎవ్రీథింగ్’ కూడా పురుషుల కోసమే. అయామ్ సారీ.. నేను కూడా ఆలోచిస్తున్నందుకు! – మల్లికా దువా వారం కాలేదు సృష్టీ ఇన్‌స్టాకు ఈ వీడియో వచ్చి. 7 లక్షల 50 వేల వ్యూస్, రెండు వేల కామెంట్స్ వచ్చాయి! వీడియోలో ఒక్కొక్కరూ స్క్రీన్ పైకి వచ్చి ‘అలా లేనందుకు సారీ’, ‘ఇలా ఉన్నందుకు సారీ’ అని మగవాళ్లకు చెప్పి వెళ్లిపోతుంటారు. మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘ఇలాంటి స్థితిలో జీవిస్తున్నందుకు సారీ’ అని ఒకరు కామెంట్ పెట్టారు. ‘హక్కుల సాధనకు సారీ చెప్పేపని లేదని నేర్పించిన స్త్రీవాదానికి మద్దతు ఇస్తున్నందుకు సారీ’ అని ఇంకొకరు అన్నారు. ‘మాటల్లో చెప్పలేకపోతున్నాను. కన్నీళ్లొస్తున్నాయి. అయామ్ సారీ.. నేను నవ్వుతూ ఉంటున్నందుకు! – శ్రీజా చతుర్వేది మీరంతా శక్తిమంతమైన, అందమైన, ఆత్మవిశ్వాసం గల అమ్మాయిలు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నేనూ మీతో పాటు కలిసి నడుస్తాను’ అని ఒక అమ్మాయి ఉద్వేగపడింది. ‘మనసు చెదిరిపోయింది. గట్ రెంచింగ్ వీడియో’ అని ఒకరన్నారు. ‘గే’ స్పందన కూడా ఉంది. ‘స్త్రీలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో.. ఒక భారతీయ పురుషుడిగా అర్థం చేసుకోగలుగుతున్నాను’ అని అతడి కామెంట్. ఇంకొక యూజర్ అయితే కాస్త కవితాత్మకంగా తిప్పి చెప్పారు. ‘‘ఈ వీడియోను వాచ్ చేసినందుకు, వాచ్ చేసి అభినందిస్తున్నందుకు నేను సారీ చెప్పడం లేదు’’ అన్నారు. అయామ్ సారీ.. నేను ఎవరి అనుమతి లేకుండా మాట్లాడుతున్నందుకు! – పవిత్రాశెట్టి ఏముంది ఇందులో.. స్త్రీల బలహీనత, వారి తిక్క తప్ప అని కామెంట్ చేసిన వాళ్లూ ఉన్నారు. ఎవరు ఏం అనుకున్నా ఇలాంటివి ఇంకా అనేకం రావలసిన పరిస్థితిలో ఉన్నాం. స్త్రీ తన అభిప్రాయాన్ని తెలిపితే ‘రేప్ థ్రెట్స్’ ఆమెకు డైరెక్టుగా మెజేస్ (డిఎం) అవుతున్న ఆధునిక అనాగరక కాలంలో ఉన్నాం. ‘స్త్రీగా పుట్టినందుకు సారీ చెబుతున్నా’ అని ఈ వీడియో చివర్లో ఒక యూట్యూబర్ అంటారు. స్త్రీ ఆవేదన అది. పురుషుడిలో ఆలోచన కలిగించేది. అయామ్ సారీ.. స్త్రీగా పుట్టినందుకు, స్త్రీగా శ్వాసిస్తున్నందుకు! – సోఫియా అష్రాఫ్ -
డయలేదాయె!
♦ డయాగ్నోస్టిక్ సెంటర్ లేనట్టే! ♦ రూ.12కోట్లు ఇవ్వలేక చేతులెత్తేసిన ప్రభుత్వం ♦ ఈసారికి సారీ అని మౌఖిక ఆదేశాలు ♦ కర్నూలు పెద్దాసుపత్రికి మరో అన్యాయం కర్నూలు(హాస్పిటల్): అడిగేవారులేరని ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెనక్కి తీసేసుకుంటోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను తుంగభద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) చేస్తామని, కర్నూలులో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ హామీలకు తూట్లు పొడిచారు. తాజాగా ఆసుపత్రికి ఏడాదిన్నర క్రితం మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను కూడా రద్దు చేశారు. ఈ విషయమై వైద్యవర్గాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా నుంచే గాక వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, ప్రకాశం, మహబూబ్‌నగర్, రాయచోటి, బళ్లారి జిల్లాల నుంచి ప్రతిరోజూ 3వేల మంది దాకా రోగులు చికిత్స నిమిత్తమై వస్తుంటారు. వీరేగాక నిత్యం 1400 నుంచి 1500మంది రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటారు. వీరందరూ వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే ఆసుపత్రిలో పెద్ద ప్రహసనంగా ఉంటోంది. ఒక్కో వైద్యపరీక్ష ఒక్కోచోట ఏర్పాటు చేయడంతో రోగులకు ఇబ్బందిగా మారింది. అవుట్ పేషెంట్ల వైద్యపరీక్షలకు 33వ నం బర్లో, ఇన్పేషంట్లకు 24వ నెంబర్లో, బ్లడ్‌గ్రూప్ చేయించుకోవాలంటే 19వ నెంబర్లో, హెచ్ఐవీ, హెచ్‌బీసీ వంటి పరీక్షలు చేయించుకోవాలంటే ఏఆర్టీ సెంటర్ వద్ద, కొన్ని రకాల బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలంటే మెడికల్ కాలేజిలోని పెథాలజి, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎంఆర్ఐ, సిటిస్కాన్ పరీక్షలు ఒకచోట, ఎక్స్‌రే పరీక్షలు నాలుగు చోట్ల, అల్ట్రాసౌండ్ పరీక్షలు ఒకచోట చేస్తారు. నిత్యం ఆసుపత్రిలో సంచరించే వారికే ఒక్కోసారి ఏ బ్లాక్ ఎక్కడ ఉందో, ఏ పరీక్ష ఎక్కడ చేస్తారో అర్థం కాదు. వైద్యనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి తిరిగేందుకు గంట సమయం పడుతుంది. ఇక వాటి నివేదికలు రావాలంటే ఒక్కోసారి రెండు నుంచి వారం రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది రోగులు ప్రైవేటు ల్యాబ్‌లలో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కో పరీక్ష ఒక్కో చోట గాకుండా అన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ.12కోట్ల అంచనాతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు జీవో జారీ చేసింది. నోరుమొదపని ప్రజాప్రతినిధ/లు.. రెండేళ్ల క్రితం మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మోకాలొడ్డుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్లానింగ్ మార్చాలని చెబుతూ రెండేళ్ల పాటు నిర్మాణం జరగకుండా జాప్యం చేశారు. ఆరు నెలల క్రితం డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పార్కింగ్ స్థలాన్ని కూడా ఎంపిక చేసి మట్టి పరీక్షలు కూడా నిర్వహించి ఓకే చేశారు. కానీ ఏమైందో ఏమో డయాగ్నోస్టిక్ సెంటర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీని నిర్మాణం గురించి అడగొద్దంటూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ భవనం వస్తే అన్ని రకాల పరీక్షలు ఒకేచోట చేయించుకోవచ్చన్న రోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిదులు సైతం ప్రశ్నించకపోవడంతో రూ.12కోట్లు కాస్తా గుంటూరు జిల్లాకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలుకు తీరని అన్యాయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలుకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టిమ్స్, రిమ్స్, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ చెప్పినా ఏవీ అమలు కాలేదు. తాజాగా రూ.12కోట్లతో మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను సైతం ఇతర ప్రాంతానికి తరలించాలని చూడటం దారుణం. ఇది కర్నూలు జిల్లా వాసులకు తీరని అన్యాయం. ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులను నమ్ముకుని ఎంతో మంది రోగులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి మరిన్ని మెరుగైన వైద్యసౌకర్యాలు అందించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా సమీక్షించి ఆసుపత్రిని అభివృద్ధి పరచాలి. –డాక్టర్ రామకృష్ణనాయక్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కర్నూలు కార్యదర్శి -
స్కాన్ ఉన్నా ప్రయోజనం సున్నా..
ఈఎస్ఐలో రెండేళ్లుగా రేడియూలజిస్ట్‌ను నియమించని వైనం రోగులకు తప్పని ఇక్కట్లు విజయనగరం ఫోర్ట్ : జిల్లా కేంద్రంలోని ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో అల్ట్రాసౌండ్ స్కాన్ సౌకర్యం ఉన్నప్పటికీ రోగులకు ఉపయోగపడడం లేదు. స్కాన్ చేసే రేడియాలజిస్టు లేకపోవడం వల్ల గర్భిణులు, జీర్ణకోశ వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. రూ.లక్షలు వెచ్చించి స్కానింగ్ పరికరాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం రేడియూలజిస్ట్‌ను నియమించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట సుమారు 8 లక్షల రూపాయలు వెచ్చించి అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరాన్ని కొనుగోలు చేశారు. 19 వేల కుటుంబాలకు ఆధారం ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ పరిధిలో సుమారు 19 వేల కుటుంబాలున్నారుు. వీరంతా వైద్య సేవల కోసం ఈ సెంటర్‌కే వస్తుంటారు. అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ అవసరమయ్యే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. దీంతో వారంతా వేరే ఆస్పత్రుల్లో స్కాన్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నెలకు రూ. 30 వేల ఖర్చు ఈఎస్ఐ ఆస్పత్రికి నెలకు 50 నుంచి 60 మంది గర్భిణులు వెళ్తుంటారు. వీరికి ఇతర ఆస్పత్రుల్లో స్కాన్ చేయడం కోసం ప్రభుత్వం నెలకు రూ. 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. మిషన్ ఉండి కూడా ఇలా డబ్బులు ఖర్చు చేయడమేమిటని రోగులు ప్రశ్నిస్తున్నారు. రేడియూలజిస్ట్‌ను నియమిస్తే అటు రోగులకు సేవలందడంతో పాటు ఇటు ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఈఎస్ఐ సూపరింటిండెంట్ టి.వి.రమణయ్య వద్ద సాక్షి ప్రస్తావించగా త్వరలోనే రేడియాజిలిస్టు పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
విషమ పరీక్ష!
జ్వరం... జలుబు చేసినా తప్పని వైద్య పరీక్షలు - అడ్డగోలుగా వెలిసిన డయాగ్నోస్టిక్ సెంటర్లు - ఇష్టారీతిగా వసూళ్లు.. జేబులకు చిల్లు - ప్రమాణాలకు చెల్లుచీటి - రోగం ఒకటైతే... రిపోర్టులో మరోటి - నియంత్రణ కోల్పోయిన జిల్లా వైద్య శాఖ - తనిఖీలు మృగ్యం రోగులు, బాధితులకు రోగ నిర్ధారణ కేంద్రాలు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లాలోని చాలాచోట్ల అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.. నివేదికలు కూడా అడ్డదిడ్డంగానే ఇస్తున్నాయి.. రోగ నిర్ధారణ నివేదికలుంటే గానీ వైద్యులు నాడీ పట్టక పోవడంతో ఈ కేంద్రాల నిర్వాహకుల పంట పం డుతోంది... సాధారణ జ్వరమొచ్చినా వైద్యులు పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు... దీన్ని సాకుగా తీసుకొని ఆయా కేంద్రాల వారు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఈ కేంద్రాల్లో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. వైద్య శాఖ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతూ తనిఖీలకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తమ్మీద రోగులతో ఆడుకుంటున్నారు. సంగారెడ్డి క్రైం: రోగమొచ్చినా.. నొప్పి వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే సామాన్యులు జడుసుకుంటున్నారు. మామూలు జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరీక్షలు రాస్తున్నారు. ఆ టెస్టులకు ఎంత మొత్తం ఖర్చవుతుందోనని బెంబేలు. అదీగాక ఏ పరీక్ష ఎటు మలుపు తిప్పుతారోనని భయం. రోగ నిర్ధారణ (డయాగ్నోస్టిక్) పరీక్ష నివేదిక లేనిదే వైద్యుడు నాడీ పట్టడం లేదు. ఫలితంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా నడుస్తున్నాయి. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి అనుబంధంగా ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి డాక్టర్ సూచన మేరకు సదరు డయాగ్నోస్టిక్ సెంటర్లోనే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడి కేంద్రంలో పరీక్షకు వసూలు చేసే రుసుంలో కొంత కమీషన్ సదరు డాక్టర్లకు ఉంటుందన్నమాట. ఇంకేముంది నాడి పట్టుకోవడానికి ముందే అన్ని పరీక్షలు చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పడం సర్వసాధారణ విషయంగా మారింది. దీంతో డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేగాక రోగం ఒకటుంటే మరో రోగం ఉన్నట్టు చూపుతున్నారు. ఉన్న రోగం లేనట్లు... లేని రోగం ఉన్నట్టు రిపోర్టుల్లో చూపించి డబ్బులు దండుకుంటున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో నిష్ణాతులైన ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి. కానీ అర్హత లేనివారు సైతం టెసు ్టలు చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ చదివిన వారే అందులో పనిచేస్తున్నారు. ఫలితంగా బాధితుడికి ఉన్న సమస్య ఏమిటో నివేదికల్లో తెలియక పోవడంతో ఒక్కోసారి వైద్యులు సైతం చేతులెత్తేస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వచ్చిన రిపోర్టునే ప్రామాణికంగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో కొన్ని సందర్భాల్లో రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలోని కొ న్ని కేంద్రాల్లో వైద్య నిర్ధారణ పరీక్షల కోసం సరైన యం త్ర సామగ్రి కూడా లేదు. మొత్తమ్మీద జ్వరం వచ్చిన రోగి కి ఆసుపత్రికి వెళ్లేలోగానే జేబులకు చిల్లు పడుతుంది. తాజాగా వెలుగు చూసిన ఘటన.. ఇటీవల సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి జ్వరం వస్తే పట్టణంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్షలు చేయించాడు. ఆ రిపోర్టులో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా చూపించడంతోపాటు ఇతర పరీక్షలు కూడా ఇష్టం వచ్చినట్టుగా చూపించారు. మూడు రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌లోని మరో కేంద్రంలో రక్త పరీక్షలు చేయించగా మరో తీరుగా వచ్చింది. నిద్రావస్థలో వైద్య ఆరోగ్య శాఖ... జిల్లాలోని పలు డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రమాణాలను పాటించకుండానే కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిని తనిఖీ చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రావస్థను వీడడం లేదు. ఈ కేంద్రాల నుంచి ప్రతి నెలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మామూళ్లు అందుతుండటం వేల్ల వాటి జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో సదరు కేంద్రాల నిర్వాహకులు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ తాము ఇచ్చిన రిపోర్టే సక్రమమని దబాయిస్తున్నారు కూడా. సామాన్యుడిని రక్షించేందుకు ఏర్పాటు చేసిన చట్టాన్ని కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
క్లిక్ & బుక్
ఒకప్పుడు నాడి పట్టుకుంటే చాలు.. రోగి ఒంట్లోని జబ్బేంటో చెప్పేసేవారు వైద్యులు. ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా.. వైద్యుడిని సంప్రదించే ముందే డయాగ్నోస్టిక్ సెంటర్ గురించి వాకబు చేయాల్సిందే. నగరంలోని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అడ్రస్‌లను, ఇతర వివరాలను అందుబాటులో ఉంచుతోంది ‘బుక్ మై ల్యాబ్’ వెబ్సైట్. కామన్ పీపుల్ భారంగా భావించే వైద్య పరీక్షలను సులభతరం చేస్తోంది. - భువనేశ్వరి ఒంట్లో నలతగా ఉంటే డాక్టర్‌ను సంప్రదిస్తాం. డాక్టర్ ఫలానా వైద్య పరీక్షలు చేయించండని చెబుతారు. ఆ టెస్ట్‌లు చేయించడం కోసం మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లను వెతకాల్సిన పని లేకుండా చేస్తోంది ‘బుక్ మై ల్యాబ్’. ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటరై.. మీ పేరిట అకౌంట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్లో మూడు వందలకు పైగా డయాగ్నోస్టిక్ సెంటర్ల అడ్రస్‌లు, ఫోన్‌నంబర్లు అందుబాటులో ఉన్నాయి. మీరున్న ఇంటికి దగ్గరగా ఉన్నది, లేదా మీకు నమ్మకమైంది ఎంచుకుని ఒక్క ఫోన్ కొడితే చాలు.. సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు మీ ఇంటికొచ్చి మరీ బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తారు. ఇక్కడితోనే బుక్ మై ల్యాబ్ పని అయిపోదు.. శాంపుల్స్‌ను పరీక్షించాక ఆ వివరాలను మీ అకౌంట్లో పొందుపరుస్తారు. మీ రిపోర్ట్స్ మీరెక్కడికి వెళ్లినా వన్ క్లిక్ దూరంలో మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఒక పరిష్కారంగా.. ‘మేం ఈ వెబ్సైట్ మొదలుపెట్టి ఆరు నెలలు కావొస్తోంది. వెయ్యిమంది పేషెంట్లు అకౌంట్ ఓపెన్ చేస్తే సక్సెస్ అయినట్టేనని భావించాం. అయితే ఇప్పటి వరకు నగరంలోని 2,600 మంది బుక్ మై ల్యాబ్‌లో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. మనకు వైద్యం అందుబాటులోకి వచ్చినంత వేగంగా.. డయాగ్నోసెంటర్ల సేవలు అందడం లేదు. ఏదైనా పేరున్న సెంటర్‌కి వెళ్తే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే బుక్ మై ల్యాబ్‌ను తీసుకొచ్చాం’ అని చెబుతారు దీని రూపకర్త శంకర్. నిక్షేపంగా.. ఈ రోజుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఎంత పదిల ంగా దాచుకోవాలో.. టెస్ట్ రిపోర్ట్స్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తోంది. దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ఇది అత్యంత అవసరం. నగరంలో చాలా మంది రోగులు రిపోర్ట్స్‌ను భద్రంగా దాచుకోలేక.. చేయించుకున్న టెస్ట్‌లే మళ్లీ చేయించుకోవాల్సి వస్తోందని ఒక సర్వేలో తేలింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బుక్ మై ల్యాబ్‌కు రూపకల్పన చేశామంటారు శంకర్. ‘మొదట కేవలం పరీక్షల రిపోర్ట్స్ భద్రపరిచే ప్లాట్‌ఫామ్‌గా దీన్ని ఉంచాలనుకున్నాం. కానీ, రోగుల అవసరాల దృష్ట్యా వారికి డయాగ్నోస్టిక్ సెంటర్ల వివరాలను అందుబాటులో ఉంచాం’ అంటారు శంకర్. అతని స్నేహితులు కాశి, ప్రమోద్‌తో పాటు మరో ఏడుగురు కుర్రాళ్లు ఈ వెబ్సైట్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. అన్నీ ఆన్లైన్... వైద్యపరీక్షల పత్రాలే కాదు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీని స్కాన్ చేసి అకౌంట్లో పెట్టుకుంటే సరి. ఈ వివరాలు అకౌంట్ హోల్డర్ అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. మరొకరు ఈ వివరాలు తెలుసుకునే వీలుండదు. ఇటీవల శ్రీనగర్‌కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌కు చెందిన 200 మంది ఒకేసారి బుక్ మై ల్యాబ్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. నిత్యజీవితంలో అన్నీ ఆన్లైన్ అయిపోతున్న ఈ తరుణంలో.. వైద్యపరీక్షలు మాత్రం ఎందుకు ఆన్లైన్లో భద్రపరచకూడదని వారు భావిస్తున్నారు.