
చాలాకాలం తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా, అందరినీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న శ్రమైక సోదరులకు నా హృదయాంజలి.
ఇటీవలే కరోను జయించిన మెగాస్టార్ చిరంజీవి ఆధ్యాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు. సతీమణ సురేఖతో కలిసి పలు దేవాలయాలను చుట్టుస్తున్నారు. ఈ క్రమంలో వీరు ఆదివారం నాడు శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చాలా కాలం తర్వాత శబరిమల స్వామిని దర్శించుకున్నానంటూ చిరంజీవి ట్విటర్‌లో ఫొటో షేర్ చేశారు.
'చాలాకాలం తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా, అందరినీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి కుటుంబాల తోడు మంచి అనుభూతినిచ్చింది' అని చిరంజీవి పేర్కొన్నారు. తనను డోలీలో మోసుకెళ్లిన శ్రామికులకు చేతులెత్తి నమస్కరించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Visiting #sabarimalatemple #feelingblessed pic.twitter.com/kdtfxXszcl
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 13, 2022