Comedian Racha Ravi Emotional Speech On Waltair Veerayya Success Meet, Deets Inside - Sakshi
Sakshi News home page

Racha Ravi: నీ కాలు మొక్త బాంచెన్‌.. నన్ను ఆపకు.. సుమను వేడుకున్న కమెడియన్‌

Published Sun, Jan 29 2023 2:43 PM | Last Updated on Sun, Jan 29 2023 4:16 PM

Comedian Racha Ravi Emotional Speech On Waltair Veerayya Success Meet - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించింది. బాబీ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించాడు. శనివారం ఈ సినిమా విజయోత్సవ సభ హన్మకొండలో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో జబర్దస్త్‌ కమెడియన్‌ రచ్చ రవి మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. మెగాస్టార్‌పై తనకున్న అభిమానం, ఆరాధనను మాటల్లో చూపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు రవి. ఈ క్రమంలో తన స్పీచ్‌కు అడ్డొస్తున్న యాంకర్‌ సుమపై విసుక్కున్నాడు.

'ఓ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతా. జీవితంలో ఇంకెక్కడా మాట్లాడను. నీ కాల్మొక్తా బాంచన్‌.. నన్ను ఆపకు(సుమ వైపు చూస్తూ). ఓరుగల్లు నీళ్లు తాగి హైదరాబాద్‌కు వచ్చిన. కృష్ణానగర్‌లో నా కన్నీళ్లు నేను తాగి బతికిన.. కానీ ఒకటే చిరంజీవి అభిమానిగానే బతుకుతున్నా.. అన్నను థియేటర్‌లో చూసిన నేను ఒక్కసారి అన్నను నేరుగా చూస్తే చాలనుకున్నా. అలాంటిది అడగ్గానే బాబీ అన్న నాకు చిరంజీవి అన్న సినిమాలో నటించే ఛాన్స్‌ ఇచ్చిండు. అంజనమ్మకు ముగ్గురు కొడుకులైతే నేను నాలుగో కొడుకుగా ప్రకటించుకుంటున్నా. ఆస్తి అడగట్లేదు, ఎప్పుడూ వారి వెనకే ఉంటాను. మెగాస్టార్‌ను చూస్తే చాలనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడే ఛాన్స్‌ వచ్చింది. జీవితానికి ఇది చాలు అని ఎమోషనలయ్యాడు రచ్చ రవి.

చదవండి: త్వరగా వచ్చేయ్‌, నిన్ను చాలా మిస్‌ అవుతున్నా
స్వచ్ఛమైన అభిమానానికి ఓరుగల్లు ప్రజలు నిదర్శనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement