Complaint Against To Jabardasth Hyper Aadi In LB Nagar Police Station - Sakshi
Sakshi News home page

హైపర్‌ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

Published Mon, Jun 14 2021 3:55 PM | Last Updated on Tue, Jun 15 2021 2:01 PM

Complaint Against Comedian Hyper Aadi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ హైపర్‌ ఆది డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, హద్దుమీరిన కామెడీపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందిన విషయం విదితమే.

చదవండి: కమల్‌ చిత్రంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement