ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి! | Cricketer Manish Pandey Wife Ashrita Shetty Full Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: పెళ్లితో సినిమాలకు పుల్‌స్టాప్.. కానీ అది మాత్రం అలానే!

Published Tue, Oct 24 2023 8:57 PM | Last Updated on Tue, Oct 24 2023 8:59 PM

Cricketer Manish Pandey Wife Ashrita Shetty Full Details - Sakshi

హీరోయిన్లు వయసులో ఉండగానే అస్సలు పెళ్లి చేసుకోరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సినిమా కెరీర్‌కి పుల్‌స్టాప్ పెట్టరు. కానీ ఈ బ్యూటీ అదే పనిచేసింది. పుట్టింది కర్ణాటకలో. చేసింది తమిళ సినిమాలు. కానీ ఓ మూవీ వల్ల తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నటైంలో టీమిండియా క్రికెటర్‌తో ఏడడుగులు వేసింది. ఇంతలా చెప్పాం కదా, మరి ఈమెని గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు)

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు ఆశ్రిత శెట్టి. అరే ఈ పేరు ఎక్కడో ఎప్పుడో విన్నట్లుందే అనిపించింది కదా! అవును మీరు ఊహించింది కరెక్టే. సిద్ధార్థ్ హీరోగా నటించిన 'NH 4' సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఆశ్రితనే. ఇది చేయడానికి ముందు తుళు భాషలో 'తెలికడ బొల్లి' అనే సినిమా చేసింది. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో మరో రెండు చిత్రాలు చేసింది. మరికొన్ని చేస్తే అనుకున్న దానికంటే ఫేమ్ వచ్చేదేమో కానీ అంతలోనే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

టీమిండియా తరఫున బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న మనీశ్ పాండేని.. ఆశ్రిత శెట్టి పెళ్లి చేసుకుంది. 2019లో కన్నడ సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. హీరోయిన్ అవ్వడం వల్లో ఏమో గానీ పెళ్లయి ఇన్నేళ్లవుతున్నా సరే గ్లామర్‌ని అలానే మెంటైన్ చేస్తూ వస్తోంది. అది చూసినప్పుడల్లా సినిమాలు ఎందుకు చేయడం మానేసిందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. సో అదనమాట విషయం. ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తపట్టారా? లేదా మేం చెప్పిన తర్వాత గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement