Akshara Singh: హీరోయిన్‌ షోపై రాళ్ల దాడి.. వీడియో వైరల్‌ | The Crowd Loses Control To Catch A Glimpse Of Akshara Singh, Police In To Lathi Charge | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్‌.. రాళ్ల దాడి, వీడియో వైరల్‌

Published Thu, Jan 18 2024 4:59 PM | Last Updated on Thu, Jan 18 2024 5:23 PM

The crowd Loses Control To Catch A Glimpse Of Akshara Singh, Police In To Lathi Charge - Sakshi

భోజ్‌పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్‌ నిర్వహించిన ఓ లైవ్‌ షో స్వల్ప ఉద్రిక్తలకు దారి తీసింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఫ్యాన్స్‌ని అదుపు చేసేందకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా..కొంతమంది తిరగబడి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ అక్షర సింగ్‌కి భోజ్‌పురిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి గాయని, డ్యాన్సర్‌ కూడా. తాజాగా అక్షర బిహార్‌లోని జౌరంగాబాద్‌ జిల్లాలో ఓ షాప్‌ ఓపెనింగ్‌కి వెళ్లింది.

(చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత)

పేపర్‌ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న  ఆమె అభిమానులు.. పెద్ద ఎత్తున ఆ షాపింగ్‌ మాల్‌కి తరలి వచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన అక్షర.. స్టైజ్‌పైకి వెళ్లి ఓ అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఫ్యాన్స్‌ మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేకుందు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. అనంతరం అక్షర సింగ్‌ని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చాలా మంది అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు అక్షర సింగ్‌కి రక్షణ కవచంగా మారి అక్కడి నుంచి సేఫ్‌గా పట్నాకు తరలించారు. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని, దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు.

(చదవండి: ఏం చేస్తోందసలు.. యాక్టింగా? గుర్తుపట్టడం కష్టమే!)

2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్‌పురి సినిమాతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్షరకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్లలో నటించారు. కొన్నాళ్ల తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో 2021లో బిగ్‌బాస్‌ ఓటీటీ వర్షన్‌లో పాల్గొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement