
టాలీవుడ్ చేస్తోన్న దాడిని ఎదుర్కొనేందుకు బాలీవుడ్ ప్రయత్నిస్తోంది. బీటౌన్ దృష్టిని మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నార్త్ సైడ్ థియేటర్స్ క్లోజ్ గా ఉండటంతో ఓటీటీ వేదిగా యుద్ధానికి సిద్ధమైంది దీపికపదుకొణె. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గెహ్రాయా. గల్లీ బాయ్ ఫేమ్ సిద్దార్ధ్ చుతుర్వేది, లైగర్ హీరోయిన్ అనన్యా పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో కపూర్ అండ్ సన్స్ తో బిగ్ హిట్ అందుకున్న శకున్ బత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదునిక దాంపత్య జీవితాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు ముహుర్తం ఖరారు అయింది.వాలెంటైన్స్ డే కానుకగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఓ స్టార్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా వచ్చే రెస్పాన్స్ కోసం హిందీ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరి ఈ రొమాంటిక్ డ్రామా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment