
కల్కి సినిమాకు కౌంట్‌డౌన్ మొదలైంది. కేవలం వారం రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ముంబైలో బుధవారం గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా దీపికా పదుకొణె కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. బేబీ బంప్‌తో కనిపించిన దీపికను చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తను స్టేజీపైకి వస్తుంటే బిగ్‌బీ చేయి పట్టుకుని తీసుకొచ్చారు. ప్రభాస్ ఆమెను కూర్చోమని చెప్పి కుర్చీ వేయించాడు.
ఈ ఈవెంట్‌లో దాదాపు అందరూ బ్లాక్ కలర్ డ్రెస్‌లోనే మెరిశారు. దీపికా సైతం టైట్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. సింపుల్‌గా ఉండేందుకే మొగ్గు చూపిన ఈ బ్యూటీ తన ఎడమ చేతికి వజ్రాల బ్రేస్‌లెట్ ధరించింది. దీని ధర 1 కోటి 16 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ ఆభరణం తన లుక్‌కే మరింత అందాన్ని తీసుకొచ్చింది.
ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, బిగ్‌బీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, పశుపతి సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా కోటగిర వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 27న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment