
పాకిస్థాన్ అమ్మాయి మొబిన్ ఏ ముహుర్తాన ‘పవ్రీ హో రహీ హై’ మీమ్ చేసిందోగాని పదిరోజుల్లోనే 5 మిలియన్ల వ్యూలు వచ్చాయి. అంతేకాదు...వసీమ్ అక్రమ్ నుంచి సింగర్ ఆలిజాఫర్ వరకు ఈ పార్టీ ట్రెండ్ వీడియోను అనుసరిస్తూ సూపర్‌ఫన్ వీడియోలు, ఫోటోలతో హల్‌చల్ చేస్తున్నారు.
‘యే హమారి కార్ హై/ ఔర్ ఏ హమ్ హై/ ఔర్ యే హమారీ పవ్రీ హో రహీ హై’ అనే మీమ్ వైరల్ ట్రెండ్‌గా మారింది. తాజాగా బాలీవుడ్ కథానాయిక దీపిక పదుకొణె తన బాల్యానికి సంబంధించిన ఫోటోలతో ‘పవ్రీ’ మీమ్ చేసింది. దీపిక మీమ్‌కు వస్తున్న రెస్పాన్స్ ఇంతా అంతా కాదు. మరి మనం కూడా ఇలాంటిదేదైనా చేస్తే పోలా!
ఇక దీపికా పదుకొనె సినిమాల విషయానికి వస్తే... భర్త రణ్‌వీర్ సింగ్‌తో కపిల్ దేవ్ బయోపిక్ ‘83’, షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’, హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ మూవీతో పాటు ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కస్’. ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరవనున్నారట పదుకొనె.
Comments
Please login to add a commentAdd a comment