ప్రభాస్‌ కల్కిలో దీపికా పదుకోన్‌ తెలుగు పలుకులు? | Deepika Padukone Shares Update On Prabhas Kalki 2898 AD Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Movie: ప్రభాస్‌ కల్కిలో దీపికా పదుకోన్‌ తెలుగు పలుకులు?

Mar 5 2024 1:31 AM | Updated on Mar 5 2024 11:11 AM

Deepika Padukone shares update on Kalki 2898 AD movie - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్  దీపికా పదుకోన్‌ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షనల్‌ మూవీకి నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్ , కమల్‌హాసన్ , దిశాపటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పద్మ అనే పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించి ఇప్పటికే దీపిక పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయిందని తెలిసింది.

అయితే ఈ సినిమాలోని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని దీపిక అనుకుంటున్నారని టాక్‌. సొంత డబ్బింగ్‌ అయితే తన పాత్రకు మరింత బలం వచ్చినట్లు అవుతుందని ఆమె భావిస్తున్నారట. అతి త్వరలోనే దీపిక వాయిస్‌కు ప్రాథమిక డబ్బింగ్‌ టెస్ట్‌ నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోనున్నారట నాగ్‌ అశ్విన్ . ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోందని తెలిసింది. ప్రభాస్, దిశాపటానీలపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మే 9న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement