
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ద్వారా హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ‘కల్కి 2898 ఏడీ’లో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ని పూర్తి చేశారట దీపికా పదుకోన్. హిందీ, కన్నడ భాషల్లో ఆమె డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. హీరో రణ్‌వీర్ సింగ్–దీపికా పదుకోన్‌లకు 2018 నవంబర్ 14న వివాహం అయింది.
ప్రస్తుతం దీపిక గర్భవతి. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి జూన్ నెల నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై ఆమె విశ్రాంతి తీసుకోనున్నారని టాక్. ఈ కారణంగానే ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారట ఆమె. అదే విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దీపిక స్పెషల్ ఇంటర్వ్యూలని కూడా ముందుగానే ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్... ఇలా పలు భాషల్లో విడుదల కానుంది. హిందీ, కన్నడ వెర్షన్లకు దీపిక డబ్బింగ్ చెప్పారు. ఇతర భాషల్లో ఆమె పాత్రకు వేరేవారితో డబ్బింగ్ చెప్పిస్తారా? లేక దీపికానే చెబుతారా? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment