
దక్షిణాది చిత్రాల్లో నటించడం తనకు చాలా ఇష్టం అంటోంది ఢిల్లీ హీరోయిన్ దేవయాని శర్మ. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన దేవయాని శర్మ శ్రీరామ్ భారతీయ కళాక్షేత్ర అకాడమీలో సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందింది. అదేవిధంగా నటికి కావలసిన అన్ని విషయాల్లోనూ తర్ఫీదు పొందింది. ఈమె ఇప్పటికే టాలీవుడ్‌లో నటుడు నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన భానుమతి రామకృష్ణ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది.
ఆ తర్వాత సైతాన్, సేవ్ ది టైగర్స్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో యువతను ఆకట్టుకుంటున్న దేవయానిశర్మ ప్రస్తుతం పలు హీరోల సరసన నటిస్తోంది. దక్షిణాది నటిగా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్న ఈమె ఇప్పుడు కోలీవుడ్‌పై కన్నేసింది. కమర్షియల్ కథానాయికగా కాకుండా మంచి బలమైన, ఛాలెంజ్‌తో కూడిన పాత్రల్లో నటించాలన్నదే తన కోరిక అంటోంది.
తాను తమిళ చిత్రాలు ఇష్టంగా చూస్తానని, కమర్షియల్ అంశాలతోపాటు, కళాత్మక కథా చిత్రాలు ఇక్కడ ఎక్కువగా రూపొందుతాయని పేర్కొంది. తమిళంలో అందరూ హీరోలు నచ్చుతారంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. కాగా త్వరలోనే ఓ తమిళ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు దేవయాని శర్మ తెలిపింది. మరి ఇక్కడ ఈ భామ లక్కు ఎలా ఉంటుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment