Deviyani Sharma
-
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025 -
#Life Stories Review: ఆరు కథలు.. విభిన్నమైన భావోద్వేగాలు
టైటిల్: #లైఫ్ స్టోరీస్నిర్మాణ సంస్థలు: అక్జన్ ఎంటర్టైన్మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ నటీనటులు : సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, ఎం. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి, హ్యారీ - గోల్డెన్ రిట్రీవర్, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్ రచన, దర్శకత్వం & నిర్మాత : ఉజ్వల్ కశ్యప్నిర్మాత : MM విజయ జ్యోతిసంగీత దర్శకుడు : విన్నుపాటలు : రామ్ ప్రసాద్, సుపర్ణ వొంటైర్, బెంట్ ఆఫ్ మైండ్, సింజిత్ యర్రమిల్లిసినిమాటోగ్రఫీ: ప్రణవ్ ఆనందఎడిటర్ : వినయ్విడుదల తేది: సెప్టెంబర్ 14, 2024కథేంటంటే..ఇదొక ఆంథాలజీ. విభిన్నమైన జీవనశైలీ గల ఆరుగురి కథ. 1) క్యాబ్ క్రానికల్స్: ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి క్యాబ్‌లో వెళ్తుండగా..కారులో కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి. అవి ఆ డ్రైవర్‌కి సంబంధించినవి. ఇంజనీరింగ్ చేసి.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వీరిద్ధరి మధ్య జరిగే సరదా సంభాషణనే మొదటి స్టోరీ2) వైల్డ్ హట్స్: ఉద్యోగం రిత్యా దూరంగా ఉన్న ఇద్దరి భార్యభర్తల కథ. న్యూ ఇయర్ రోజున ఇద్దరు కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటారు.కానీ భార్య శ్రెయా (షాలిని కొండేపూడి)కి తన బాస్ ఎక్కువ వర్క్ ఇవ్వడంతో ఆఫీస్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. చివరకు భార్యభర్తలు కలిసి న్యూఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నారా లేదా? ‘వర్చువల్ క్యాండిలైట్ డిన్నర్’ సంగతేంటి అనేదే మిగతా కథ.3) బంగారం: ఒంటరిగా ఉన్న ముసలావిడ మంగమ్మ కథ ఇది. ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం. కానీ కొనుక్కునే స్థోమత ఉండదు. రోడ్డు పక్కన టీ షాపు పెట్టుకొని జీవితాన్ని గడుపుతుంది. ఓ రోజు రోడ్డుపై ఓ పెంపుడు కుక్కని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిపోతాడు. ఆ కుక్కను బంగారం అని పేరు పెట్టి మంగమ్మ చేరదీస్తుంది. ‘బంగారం’ వచ్చిన తర్వాత మంగమ్మ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అనేది మిగతా కథ.4) మామ్ మీ: ఓ సింగిల్ మదర్(దేవియని శర్మ) స్టోరీ ఇది. జాబ్లైఫ్లో పడి కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతుంది. అతని మంచి చెడులను ఎక్కువగా పని మనిషే చూసుకుంటుంది. అయితే తల్లితో ఆడుకోవాలని, లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాలని పిల్లాడు ఆశ పడతాడు. మరి అతని ఆశ నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ.5) గ్లాస్‌మేట్స్: ఓ సీరియర్ కపుల్ స్టోరీ ఇది. న్యూఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఆ జంట రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ భర్తకి కాలేజీ ఫ్రెండ్ కనిపిస్తాడు. దీంతో వారిద్దరు కలిసి మద్యం సేవిస్తూ కాలేజీ ముచ్చట్లు చెప్పుకుంటారు. మరోవైపు ఇద్దరి భార్యలు కూడా గదిలోకి వెళ్లి మందు తాగుతూ సరదగా గడుపుతుంటారు. ఆ సరదా సంభాషణలు ఏంటనేది తెరపై చూడాల్సిందే.6) జిందగీ: సాఫ్వేర్ ఉద్యోగి తన ప్రియురాలితో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ చివరి నిమిషంలో ఆమె రాలేనని చెబుతుంది. లవర్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ సాఫ్వేర్ ఉద్యోగి ఏం చేశాడు? విడివిడిగా సాగిన ఈ ఆరు కథలు చివరకు ఎలా కలిశాయి అనేది తెలియాలంటే #లైఫ్స్టోరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత కథ చెప్పే విధానం మారిపోయింది. కొత్త కొత్త కథలను.. విభిన్నమైన రీతిలో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న కథలను కలిపి ఓ పెద్ద కథగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. వీటినే మనం ఆంథాలజీ సినిమాలు అంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు నార్త్‌లో చాలా ఏళ్ల కిందటే జరిగాయి. కానీ సౌత్‌లో మాత్రం ఈ మధ్యే ఆంథాలజీ సినిమాలు వస్తున్నాయి. సౌత్ ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. #లైఫ్ స్టోరీస్ కూడా ఓ ఆంథాలజీ ఫిల్మ్. టైటిల్‌కు తగ్గట్టే ఇది మనతో పాటు మన చుట్టు ఉండే జనాల జీవన శైలీని తెలియజేసే చిత్రం. ప్రతి కథలోని పాత్రలతో మనం కనెక్ట్ అవుతాం. మనలోనో లేదా మన చుట్టో అలాంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు.(చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)అయితే ఎంత మంచి కథ అయినా ఆసక్తికరంగా చెప్పకపోతే ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీల్ అవుతారు. డైరెక్టర్ ఉజ్వల్ కశ్యప్ కొన్ని చోట్ల ఆ తప్పిదం చేశాడు. స్టోరీ బాగున్నప్పటికీ.. సన్నివేశాలను సాగదీయడం.. అవసరం లేకున్నా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే సంభాషణలు చెప్పించడం కొంతవరకు తెలుగు ఆడియన్స్‌కు ఇబ్బందికరమే. స్లోనెరేషన్ ఈ సినిమాకు మరో మైనస్ పాయింట్. మొదటి స్టోరీకి చాలా సింపుల్‌గా పుల్‌స్టాఫ్ పెట్టి రెండో కథను స్టార్ట్ చేశాడు. దీంతో ‘క్యాబ్ క్రానికల్స్’ స్టోరీ ప్రేక్షకుడికి అర్థమేకాదు. కానీ చివరల్లో ఈ స్టోరీతో మిగతా కథలను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక రెండో స్టోరీ వైల్డ్ హాట్స్‌లో ఉద్యోగం చేసే భార్యభర్తల జీవితాలు ఎలా ఉంటాయో చూపించాడు. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ.. సిటీలో ఉద్యోగం చేసే భార్యభర్తలు ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు. ‘వర్చువల్ క్యాండిలైట్ డిన్నర్’ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఆరు కథలో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ ‘బంగారం’. మంగమ్మ లైఫ్ జర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది. మామ్ మీ కథ వర్క్‌పరంగా ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు కాస్త సమయం కేటాయించాలని తెలియజేస్తుంది. గ్లాస్‌మేట్స్ స్టోరీ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. జిందగీ కథతో మిగతా స్టోరీలన్నీ ముడిపడి ఉంటాయి. ఈ ఆరు కథలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చుట్టూ సాగుతూనే.. చివరల్లో కలిసిన విధానం ఆకట్టుకుటుంది. క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఆంధాలజీ సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రకు న్యాయం చేశారు. మంగమ్మగా నటించిన వృద్ధురాలు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. ఆ పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. సింగిల్ పేరెంట్‌గా దేవయాని శర్మ చక్కగా నటించింది. ప్రైవేట్ బస్ కండక్టర్ గా కనిపించిన రాజశేఖర్ ఆకట్టుకున్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ పీయూష్ పాత్రలో సత్య ఒదిగిపోయాడు. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' సిరీస్‌లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. ఆమె ఉపయోగిస్తున్న ఫోన్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని వల్ల మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే స్పందించొద్దని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?)దేవయాని ఏం చెప్పింది?'కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఎందుకంటే అది నేను కాదు''ఇప్పటికే దీని వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అలానే మూడుసార్లు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజులు వచ్చిన చేస్తున్నది నేను కాదని అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది. మామూలుగానే ఆర్టిస్ట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతోంది' అని దేవయాని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్) -
ఆ హీరోపై కన్నేసిన హీరోయిన్.. అదే తన లక్ష్యమట!
కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న శింబుతో జత కట్టడమే తన జీవిత లక్ష్యం అంటోంది వర్ధమాన నటి దేవయాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది. అదేవిధంగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. 2021లో రొమాంటిక్ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. ఆవిధంగా ప్రారంభంలోనే గుర్తింపు తెచ్చుకున్న దేవయానిశర్మ పలు రకాల నృత్యాల్లో శిక్షణ పొందడం విశేషం. హిందీ, తెలుగు భాషల్లో నటిస్తున్నా తమిళ చిత్రాల్లో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది. సాధారణ కథానాయకి పాత్రల్లో కాకుండా ప్రతిభకు పదునుపెట్టే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలన్నదే తన ఆశయమని చెబుతోంది. హీరోయిన్లలో కీర్తీ సురేష్, సాయిపల్లవి అంటే తనకు చాలా ఇష్టమని.. నటిగా వారే తనకు ఆదర్శమని పేర్కొంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే శింబు అంటే పిచ్చి అభిమానమని.. కచ్చితంగా ఆయనతో జత కడతానని.. అదే తన జీవిత లక్ష్యమని అంటోంది. అందుకోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పింది. అదే సమయంలో మంచి నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడానికి తన వంతు కృషిచేస్తానని చెప్పింది. మొత్తం మీద హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పాగా వేసిన ఢిల్లీ భామ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోనూ త్వరలో పాగా వేస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఆశ ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Deviyani Sharma (@deviyyani) -
కోలీవుడ్‌పై కన్నేసిన సైతాన్ హీరోయిన్!
దక్షిణాది చిత్రాల్లో నటించడం తనకు చాలా ఇష్టం అంటోంది ఢిల్లీ హీరోయిన్ దేవయాని శర్మ. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన దేవయాని శర్మ శ్రీరామ్ భారతీయ కళాక్షేత్ర అకాడమీలో సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందింది. అదేవిధంగా నటికి కావలసిన అన్ని విషయాల్లోనూ తర్ఫీదు పొందింది. ఈమె ఇప్పటికే టాలీవుడ్లో నటుడు నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన భానుమతి రామకృష్ణ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత సైతాన్, సేవ్ ది టైగర్స్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో యువతను ఆకట్టుకుంటున్న దేవయానిశర్మ ప్రస్తుతం పలు హీరోల సరసన నటిస్తోంది. దక్షిణాది నటిగా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్న ఈమె ఇప్పుడు కోలీవుడ్‌పై కన్నేసింది. కమర్షియల్ కథానాయికగా కాకుండా మంచి బలమైన, ఛాలెంజ్‌తో కూడిన పాత్రల్లో నటించాలన్నదే తన కోరిక అంటోంది. తాను తమిళ చిత్రాలు ఇష్టంగా చూస్తానని, కమర్షియల్ అంశాలతోపాటు, కళాత్మక కథా చిత్రాలు ఇక్కడ ఎక్కువగా రూపొందుతాయని పేర్కొంది. తమిళంలో అందరూ హీరోలు నచ్చుతారంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. కాగా త్వరలోనే ఓ తమిళ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు దేవయాని శర్మ తెలిపింది. మరి ఇక్కడ ఈ భామ లక్కు ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేసిందా? -
దేవియాని.. ఓ అందాల ‘సైతాన్’
విరబోసిన జుట్టు.. కోరపళ్లు.. మెలితిరిగిన పాదాల సైతాన్ కాదు దేవియాని శర్మ.. పల్చటి మొహం.. గవ్వల్లాంటి కళ్లు.. మైమరపించే నవ్వుతోనే హడలెత్తించే అందాల రాక్షసి! భీకరమైన ఆహార్యంతో కాకుండా హావభావాలతోనే భయం పుట్టించే పాత్రలో జీవించింది దేవియాని. అదే ఓటీటీలోని ‘సైతాన్’ సిరీస్. ఆ విజయమే ఇక్కడ ఆమె పరిచయానికి కారణం.. ఢిల్లీలో పుట్టి, పెరిగిన దేవియాని.. టీనేజ్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. నటనపై ఉన్న ఆసక్తితో చిన్నప్పుడే స్టేజీ నాటకాల్లో నటించింది. బాలీవుడ్ ‘లవ్శుదా’ చిత్రంలో ఒక చిన్న పాత్రతో సినీ రంగప్రవేశం చేసింది. అక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ వచ్చి, ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తర్వాత ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ లోనూ నటించింది. ఆ సినిమాల కమర్షియల్ సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆమె ప్రతిభకు మాత్రం తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా ‘అనగనగా’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’, ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌లలో నటించి.. స్టార్‌గా మారింది. దేవియాని మంచి చిత్రకారిణి. తన పెయింటింగ్స్ కోసమే ‘కళామాటిక్స్’ పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తోంది. ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘సైతాన్’ సిరీస్‌తో అలరిస్తోంది. ఇందులో దేవియాని మాస్ అమ్మాయి పాత్రలో వైల్డ్ అండ్ బోల్డ్‌గా నటించి మెప్పించింది.‘బాహుబలి’ తర్వాత తెలుగు చిత్రాలకున్న క్రేజ్ తెలుసుకున్నా! అందుకే ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో హైదరాబాద్‌కి వచ్చా! – దేవియాని శర్మ