దేవియాని.. ఓ అందాల ‘సైతాన్‌’ | Interesting Facts About Deviyani Sharma | Sakshi
Sakshi News home page

‘సైతాన్’లో బోల్డ్‌గా నటించిన ఈ భామ ఎవరో తెలుసా?

Published Sun, Jul 2 2023 2:53 PM | Last Updated on Sun, Jul 2 2023 3:06 PM

Interesting Facts About Deviyani Sharma - Sakshi

విరబోసిన జుట్టు.. కోరపళ్లు.. మెలితిరిగిన పాదాల సైతాన్‌ కాదు దేవియాని శర్మ.. పల్చటి మొహం.. గవ్వల్లాంటి కళ్లు.. మైమరపించే నవ్వుతోనే హడలెత్తించే అందాల రాక్షసి! భీకరమైన ఆహార్యంతో కాకుండా హావభావాలతోనే భయం పుట్టించే పాత్రలో జీవించింది దేవియాని. అదే ఓటీటీలోని ‘సైతాన్‌’ సిరీస్‌. ఆ విజయమే ఇక్కడ ఆమె పరిచయానికి కారణం..

ఢిల్లీలో పుట్టి, పెరిగిన దేవియాని.. టీనేజ్‌లోనే మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. నటనపై ఉన్న ఆసక్తితో చిన్నప్పుడే స్టేజీ నాటకాల్లో నటించింది. బాలీవుడ్‌ ‘లవ్‌శుదా’ చిత్రంలో ఒక చిన్న పాత్రతో సినీ రంగప్రవేశం చేసింది.

అక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌ వచ్చి, ‘భానుమతి అండ్‌ రామకృష్ణ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తర్వాత ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’ లోనూ నటించింది. ఆ సినిమాల కమర్షియల్‌ సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆమె ప్రతిభకు మాత్రం తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా ‘అనగనగా’, ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’, ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌ సిరీస్‌లలో నటించి.. స్టార్‌గా మారింది.

దేవియాని మంచి చిత్రకారిణి. తన పెయింటింగ్స్‌ కోసమే ‘కళామాటిక్స్‌’ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నిర్వహిస్తోంది. ప్రస్తుతం డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘సైతాన్‌’ సిరీస్‌తో అలరిస్తోంది. ఇందులో దేవియాని మాస్‌ అమ్మాయి పాత్రలో వైల్డ్‌ అండ్‌ బోల్డ్‌గా నటించి మెప్పించింది.‘బాహుబలి’ తర్వాత తెలుగు చిత్రాలకున్న క్రేజ్‌ తెలుసుకున్నా! అందుకే ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో హైదరాబాద్‌కి వచ్చా! – దేవియాని శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement