టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ అధికారుల సోదాలు దాదాపు ముగిశాయి. గత ఐదురోజులుగా ఆయన ఇళ్లు, ఆఫీసులలో సోదాలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఐటీ సోదాలు గురించి ఆయన రియాక్ట్ అయ్యారు.
'ఐటీ రైడ్స్ జరిగినప్పుడు మా వద్ద రూ. 20 లక్షలు ఉన్నాయి. మా అకౌంట్ బుక్స్ అన్నీ ఐటీ అధికారులు చెక్ చేశారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఐటీ సోదాలు సర్వసాధారణం. మా దగ్గర డబ్బు , డాకుమెంట్స్ తీసుకున్నారని వార్తలు వేశారు. అందులో నిజం లేదు. గత ఐదేళ్ల నుంచి నేను ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టలేదు. నా దగ్గర డబ్బు, ఆస్తి పత్రాలు వంటివి దొరకలేదు. అయితే, నా దగ్గర నుంచి రూ. 5 లక్షలు, శిరీష్ దగ్గర నుంచి రూ. 4.50 లక్షలు ఐటీ అధికారులు తీసుకున్నారు. మేము క్లీన్‌గా ఉండొచ్చు.. కానీ, మా దగ్గర డబ్బు తీసుకున్న వారు కూడా క్లీన్‌గా ఉండాలి కదా.
2008లో ఒకసారి నా ఆఫీసులో సెర్చ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. మా అకౌంట్స్ అన్నీ చెక్ చేసిన ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు ఆశ్చర్యపోయారు. దిల్ రాజు దగ్గర ఏదో ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ, ఇక్కడ అన్ని లెక్కలు నీట్‌గా ఉన్నాయని వారే చెప్పారు. మా అమ్మ కు సడెన్‌గా దగ్గు వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాం. కానీ, హార్ట్ అటక్ అని ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామందిపై ఐటీ రైడ్స్ జరిగాయి. నన్ను ఎవరు టార్గెట్ చేయలేదు.' అని ఆయన అన్నారు.
కలెక్షన్స్ ఎక్కువ చెప్పడం తప్పే: దిల్ రాజు
ఐటీ సోదాలు అంశంలో ఎవరూ ఎక్కువగా ఊహించుకొవద్దని దిల్ రాజు అన్నారు. ఎలాంటి హాడావుడి లేకున్నా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో అంతా ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ కొనసాగుతుంది అన్నారు. దీంతో వ్యాపారా ట్రాన్సాక్షన్సె కూడా ఆన్‌లైన్ జరుగుతున్నాయి అన్నారు. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయి కదా అని గుర్తు చేశారు. సినిమాల కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటంపై ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడాతామని దిల్ రాజు పేర్కొన్నారు. ముమ్మాటికి ఈ విధానం తప్పు అని అన్నారు. అందరూ ఈ తీరు మార్చుకొవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారని ఆ సమయంలో తమ ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని దిల్ రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment