కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించారు. తెలుగులో ‘బీస్ట్’ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్’రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత దిల్‌రాజు పూజాహెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఆయన మాట్లాడుతూ పూజా..మన కాజా, అడుగుపెడితే హిట్టే అంటూ ఆకాశానికెత్తేశాడుడు. దీంతో ఆడియెన్స్ అరుపులతో హోరెత్తించారు. అంతటితో ఆగకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి డేట్స్ ఇవ్వమని కూడా స్టేజ్‌మీదే అడిగేశారు.చివరగా పూజాను పాన్ ఇండియా హీరోయిన్ అంటూ ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment