‘‘దర్శకుడిగా చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నాను. ‘గాలి సంపత్’ చిత్రానికి సమర్పకుడిగా బాధ్యతలు తీసుకున్నాక నిర్మాతల కష్టాలు తెలిశాయి. ఈ సినిమాకి సాహు, హరీష్ వెన్నెముకలా నిలిచారు. తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేశాం. నిర్మాతలు సేఫ్’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ జంటగా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వం వహించారు. ఎస్. కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘నా ఫ్రెండ్ ఎస్. కృష్ణ నా సినిమాలకు రైటర్‌గా చేశాడు. నిర్మాతగా లాంచ్ అవ్వాలని తనే ‘గాలి సంపత్’ కథ రాసుకున్నాడు. టైటిల్ వినగానే గాలికి తిరిగే వ్యక్తి కథేమో అనుకున్నాను. కానీ నోట్లో నుంచి మాట రాకుండా కేవలం గాలి మాత్రమే వచ్చేలా గాలి సంపత్ క్యారెక్టర్ ఉంటుందనగానే ఆసక్తిగా అనిపించింది.
మాటలు రాని వ్యక్తి గోతిలో పడ్డాక ఎలా పైకి వస్తాడన్న కాన్సెప్ట్ నన్ను ఎగ్జయిట్ చేయడంతో ఈ టీమ్‌తో కలిశాను. తండ్రి రాజేంద్రప్రసాద్ వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీవిష్ణు బాగా నటించాడు. ఈ సినిమాలో వర్షం కూడా ఓ విలన్ లా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు కూడా ‘గాలి సంపత్’ చూసి థ్రిల్ అవుతారు. నేను స్టార్ట్ అయ్యిందే చిన్న సినిమాల నుంచి కాబట్టి కథ బాగుంటే అలాంటి చిత్రాలను ప్రోత్సహిస్తా. సమయం వచ్చినప్పుడు నేను కూడా చిన్న చిత్రాలు చేస్తా. ‘ఎఫ్3’ షూటింగ్ 22 డేస్ చేశాం. సాహూతో త్వరలో ఓ సినిమా చేస్తా. హీరో రామ్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. బాలకృష్ణతో సినిమా ఇంకా ఖరారు కాలేదు. మహేశ్‌బాబుతో మరో సినిమా గురించి చర్చలు జరుగుతు న్నాయి. సాయిపల్లవితో ఓ లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ ఫిల్మ్ చేద్దామనుకున్నాను కానీ కుదర్లేదు. నా సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలనుకుంటే ‘పటాస్’ను హృతిక్ రోషన్ తో చేయాలని ఉంది’’ అన్నారు.
చదవండి:
ఏం సక్కగున్నావ్‌రో.. అందరి కళ్లు బన్నీ పైనే!
ఆమె పేరు వింటే శత్రువులకి దడ
ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్!
Comments
Please login to add a commentAdd a comment