కంగువా.. ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో గ్లామర్‌ బ్యూటీ! | Disha Patani as Action Lady in Kanguva Movie | Sakshi
Sakshi News home page

Disha Patani: హీరోయిన్‌కు అన్ని ఫైట్సా? హీరోకు ఏ రేంజ్‌లో ఉంటాయో!

Published Sat, Feb 10 2024 5:05 PM | Last Updated on Sat, Feb 10 2024 5:52 PM

Disha Patani as Action Lady in Kanguva Movie - Sakshi

సూర్య కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ కంగువా. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ అధినేత కేఈ. జ్ఞానవేల్‌ యూవీ క్రియేషన్‌న్స్‌ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా నటించగా హిందీ నటుడు బాబీ డియోల్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. త్రీడీ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ పీరియాడికల్‌, సోషల్‌ కథా చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

కంగువ చిత్రాన్ని పది భాషల్లో రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూర్య ఆరు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మరో విషయం ఏంటంటే ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాబీ డియోల్‌కు ఇంట్రో సాంగ్‌ ఉంటుందట. గ్లామర్‌ డాల్‌గా పాపులర్‌ అయిన దిశా పటాని ఇందులో పూర్తిగా వైవిద్య భరిత కథా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో ఆమె ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపించనుందట!

చిత్రంలో ఆమెకు ఏకంగా ఆరు ఫైట్స్‌ ఉంటాయని సమాచారం. దిశా పటాని తమిళంలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. మరోవైపు ప్రభాస్‌తో కలిసి కల్కి 2898 AD అనే సినిమా చేస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో ఈ అమ్మడు నటిస్తున్న రెండు చిత్రాలు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందడం విశేషం.

చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement