ప్రశాంత్ కృష్ణ, అచ్యస సిన్హా, సందీప్
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘డ్రీమ్ క్యాచర్’. సందీప్ కాకుల దర్శకత్వంలో సీయెల్ మోషన్ పిక్చర్స్‌పై రూపొందిన ఈ సినిమా జనవరి 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సందీప్ కాకుల మాట్లాడుతూ– ‘‘నిద్రలో వచ్చే కలలపై సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. కలల నేపథ్యంలో ఇలాంటి సినిమా ఇప్పటి దాకా తెలుగులో రాలేదని చెప్పగలను.
గంటన్నర నిడివితో ఉండే ఈ మూవీలో పాటలు, ఫైట్స్ ఉండవు’’ అన్నారు. ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. మా మూవీ ట్రైలర్ చూశాక అడివి శేష్, రానాగార్లలా నేను ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాంటి ప్రతిభ ఉన్న నటులతో నన్ను పోల్చడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. కెమేరామేన్ ప్రణీత్ గౌతమ్ నందా, ట్రైలర్‌కి సంగీతం అందించిన వెంకటేశ్, సిద్ధార్థ్ కాకుల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రోహన్ శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్. రవివర్మ.
Comments
Please login to add a commentAdd a comment