Pre-Release
-
ఊహించని లాభాలలో విరుపాక్ష మూవీ ప్రాఫిట్ ఎన్ని కొట్లో తెలిస్తే బిత్రరాపోతారు..
-
‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. ’అంటూ రానాకు క్లాస్ పీకిన సూర్య..!
‘‘కరోనా టైమ్‌లో ‘అఖండ’, ‘పుష్ప’, ‘బంగార్రాజు’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. మిగతా ఇండస్ట్రీలకు సినిమాలను విడుదల చేయాలనే ఆత్మవిశ్వాసం టాలీవుడ్ వల్లే కలిగింది’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఈటీ’. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. నారాయణ్‌దాస్ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథులుగా పాల్గొన్న హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్ మలినేని ‘ఈటీ’ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ – ‘‘ఇటీవల నా ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి సినిమాకు హద్దు లేదని నిరూపించారు. ఆ రెండు చిత్రాల్లా ‘ఈటీ’ కూడా స్పెషల్ ఫిల్మే. ఇక నా అగరం ఫౌండేషన్‌కు స్ఫూర్తి చిరంజీవిగారు. సినిమాల వల్ల మంచి స్థాయికి వెళ్లిన నేను ఏదో ఒకటి చేయాలని ఈ అగరం ఫౌండేషన్‌ని స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. మనసు ఏం చెప్పిందో దాన్నే ధైర్యంగా చేయండి. కంఫర్ట్ జోన్లో ఉంటే ఎదుగుదల ఉండదు. అందుకే కంఫర్ట్ జోన్లో ఉండకండి’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సూర్యగారు ‘‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్.. (స్టేజ్ పై నవ్వులు)’ అని క్లాస్ పీకారు. ఆ క్లాసే నన్ను భల్లాలదేవుడిని చేసింది. డేనియల్ శేఖర్ని చేసింది (సూర్య మైకు తీసుకుని ఇప్పుడు రానాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు). ‘ఈటీ’ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌గారి తర్వాత సూర్యని ‘మన’ అని తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు. అలాంటి సూర్యగారు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘ ‘సూర్యగారు మాస్ ఫిల్మ్ చేస్తే షేకే. ఓ యునిక్ స్టైల్ ఉన్న డైరెక్టర్ పాండిరాజ్‌గారు’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ‘‘హైదరాబాద్‌లో జరిగిన కార్తీ ‘చినబాబు’ సినిమా ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సూర్యగారి పేరు ప్రస్తావనకు రాగానే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ చూస్తున్నాను. సూర్యగారు స్ట్రయిట్‌గా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు పాండిరాజ్. ‘‘ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేస్తుంటారు సూర్య. ‘ఈటీ’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘‘ప్రతి కథను డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకునే ఇండియన్ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా అందులో ఓ కొత్తదనం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో సౌత్ ఇండియా సినిమాల పట్ల, ముఖ్యంగా తెలుగు సినిమాల పట్ల ముంబైలో మరింత గౌరవం పెరిగింది. సూర్యగారు చేసిన ‘ఈటీ’ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్‌రాజా. నిర్మాత రాజశేఖర్ పాండియన్, కెమెరామేన్ రత్నవేలు, నటులు వినయ్ రాయ్, మధుసూదన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయనకి జాతీయ అవార్డు రావాలి
‘‘మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయిందే రాజేంద్రప్రసాద్‌గారి ‘లేడీస్ టైలర్’ సినిమాతో. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చిన్నదే అవుతుంది. ‘గాలి సంపత్’ సినిమాతో ఆయనకు జాతీయ అవార్డు రావాలి.. వస్తుందనుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ మాట్లాడుతూ–‘‘గాలి సంపత్’ ట్రైలర్ చూశాక రాజ్‌కుమార్ హిరాణీ చిత్రంలా అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జీవితంలో నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా ‘లేడీస్ టైలర్’ స్రవంతి మూవీస్‌దే.. ఆ సినిమా లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ‘గాలి సంపత్’ నా జీవితంలో ఒక ఆణిముత్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య సాగే ఫన్ అండ్ ఎమోషన్ జర్నీ ‘గాలి సంపత్’’ అన్నారు అనీష్. ‘‘మా ‘గాలి సంపత్’ చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన రామ్. ‘‘హీరో రామ్‌గారితో పాటు సాహు, హరీష్గార్లతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నేనెప్పుడూ నా క్యారెక్టర్ చూసి సినిమాలు చేయను.. కథ చూసి చేస్తా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో లవ్లీ సింగ్, కెమెరామెన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు అచ్చురాజమణి, దర్శకులు గోపీచంద్ మలినేని, బీవీఎస్ రవి, శివ నిర్వాణ పాల్గొన్నారు. -
2.0 @ 2:28:52
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 29వ తేదీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ ‘2.ఓ’ థియేటర్లోకి వచ్చే రోజు అది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 2010లో వచ్చిన ‘ఎందిరిన్’ చిత్రానికి ‘2.ఓ’ సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యయని కోలీవుడ్ సమాచారం. నిడివి 2గంటల 28నిమిషాల 52 సెకన్లు అట. సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పలేదు కానీ కొన్ని పదాలను మ్యూట్ చేయమని అడిగారట. ఇంకో విషయం ఏంటంటే... ఇప్పటివరకూ శంకర్ దర్శకత్వం వహించిన ‘జెంటిల్‌మేన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో’ తదితర చిత్రాల్లోకెల్లా ‘2.ఓ’ సినిమా నిడివి తక్కువని కోడంబాక్కమ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్ కెరీర్లో 1995లో విడుదలైన ‘ముత్తు’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 23న జపాన్‌లోని టోక్యోలో రీ–రిలీజ్ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. -
ఆ నలుగురి వల్లే ఈ స్థాయికి ఎదిగా
– లారెన్స్ ‘‘నేను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగా. అందుకు కారణం మా అమ్మగారు, ఆ రాఘవేంద్రస్వామి, ఇండస్ట్రీలో నాకు డ్యాన్సర్ స్థానాన్ని కల్పించిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు, నన్ను కొరియోగ్రాఫర్‌ని చేసిన చిరంజీవిగారు. ఈ నలుగురుకీ నా కృతజ్ఞతలు’’ అని రాఘవా లారెన్స్ అన్నారు. నృత్యదర్శకుడిగా, దర్శకుడిగా, నటుడిగా లారెన్స్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రస్తుతం రాఘవా లారెన్స్, రితికా సింగ్ జంటగా పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించిన ‘శివలింగ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. మంగళవారం జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో లారెన్స్ మాట్లాడుతూ –‘‘శివలింగ’ చిత్రం కన్నడలో హిట్ అయింది. అందులో శక్తీ వాసు నటన చూసి, క్యారెక్టర్లో కొన్ని మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందనగానే వాసుగారు మార్పులు చేశారు. తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. లేటైనా, లెటెస్ట్‌గా వస్తున్నాం’’ అని పి.వాసు చెప్పారు. ‘‘వాసు దర్శకత్వ ప్రతిభ గురించి కొత్తగా మాట్లాడాల్సిన పనిలేదు. లారెన్స్, రితికా నటన ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్కాపురం శివకుమార్. నటుడు శక్తీ వాసు, రితికా సింగ్, నిర్మాత బెల్లంకొండ సురేశ్ పాల్గొన్నారు.