ఎడిటర్‌ కోలా భాస్కర్‌ కన్నుమూత | Editor Kola Bhaskar Passed Away | Sakshi
Sakshi News home page

ఎడిటర్‌ కోలా భాస్కర్‌ కన్నుమూత

Published Thu, Nov 5 2020 12:22 AM | Last Updated on Thu, Nov 5 2020 12:22 AM

Editor Kola Bhaskar Passed Away - Sakshi

‘ఖుషి’, ‘7/జి బందావన్‌ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’...చిత్రాలతో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన కోలా భాస్కర్‌ (55) బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంత కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారాయన. భాస్కర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ సతీమణి గీతాంజలి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘నన్ను వదలి నీవు పోలేవులే’తో హీరోగా పరిచయమయ్యారు భాస్కర్‌ కుమారుడు కోలా బాలకృష్ణ. ఈ చిత్రాన్ని కోలా భాస్కర్‌ నిర్మించారు. కాగా కోలా భాస్కర్‌ మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement