ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇ‍ప్పుడు లాయర్‌గా! | Ee Rojullo Movie Actress Reshma Rathore Full Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఆ హిట్ సినిమాలో హీరోయిన్.. ఇప్పుడేమో లాయర్‌

Published Thu, Aug 31 2023 8:59 PM | Last Updated on Thu, Aug 31 2023 9:22 PM

Ee Rojullo Movie Actress Reshma Rathore Full Details - Sakshi

ఈమె తెలుగమ్మాయి. సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. త్రిషకు ఫ్రెండ్‌గా నటించి సినిమా కెరీర్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది హీరోయిన్ గా ఓ మూవీలో నటించే బంపరాఫర్ అందుకుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఆ తర్వాత ఆమెకు పలు అవకాశాలొచ్చినా అవి సక్సెస్ కాలేదు. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రేష్మా రాథోడ్. ఎవరనేది కచ్చితంగా గుర్తురాకపోవచ్చు. సరే అక్కడికే వచ్చేద్దాం. వెంకటేశ్-త్రిష 'బాడీగార్డ్' సినిమాలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా ఈమె నటించింది. అదే ఏడాది రిలీజైన 'ఈ రోజుల్లో' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కథానాయికగా తొలి మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది.

(ఇదీ చదవండి: ఇరకాటంలో రష్మిక.. ఒకేరోజు ఆ రెండు సినిమాలు రిలీజ్)

'ఈ రోజుల్లో' తర్వాత జై శ్రీరామ్‌, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం, అప్పవుమ్ వీంజుమ్(మలయాళ), అదగపట్టత్తు మగజననంగలయ్(తమిళ) తదితర చిత్రాలు చేసింది గానీ ఈమె వీటిలో ఒక్కటి కూడా కలిసి రాలేదు. దీంతో 2017 తర్వాత పూర్తిగా నటనకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీజేపీ పార్టీలో చేరింది. దీనితోపాటే లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది.

నటిగా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయిన రేష్మా.. పొలిటికల్, లాయర్ గా మాత్రం తనదైన మార్క్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే జూలైలో సుప్రీంకోర్టు లాయర్‌గా పదోన్నతి పొందింది. ఇకపోతే అప్పట్లో ఒకలా ఉన్న రే‍ష్మా.. ఇప్పుడు చాలావరకు మారిపోయి కనిపించింది. దీంతో ఆమెని కాసేపు గుర్తుపట్టలేకపోయారు. ఏదేమైనా ఓ తెలుగు హీరోయిన్ సుప్రీం కోర్టులో లాయర్ కావడం గ్రేట్ అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement