
గీతానంద్, నేహా సోలంకి (90 ఎంఎల్ ఫేమ్ ) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'పడిపోతున్న' అనే సెకండ్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. 'గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవాబ్ గ్యాంగ్ చక్కని సంగీతం అందించారు. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రానికి టైటిల్ సాంగ్‌కి పనిచేశారు. అంత బిజీగా ఉన్నా అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్‌గా ఈ సినిమా చెయ్యడం విశేషం. చిత్రీకరణ , నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.' అని అన్నారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. 'రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. ట్విస్టులతో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది. మేము చెప్పిన కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నా. ఈ సినిమాకు హీరోగా, దర్శకుడుగా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీగా పని చేస్తున్నాం. ఈ సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment