గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్ కె.కృష్ణ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని స్వాతిముత్యం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. 'ఏరా అమ్మాయిని కలిశావా..? పంతులు గారుతో ఇప్పుడే మాట్లాడాను...అమ్మాయి వాళ్ళ నాన్నకి పట్టింపులు ఎక్కువ పద్దతి అది ఇది అని బుర్ర తినేస్తాడంటాడేంటి?' అనే రావు రమేష్ మాటలతో వీడియో మొదలవుతుంది.
హీరోయిన్ నువ్వు వర్జినా? అని ముఖం మీదే అడిగేసరికి ఖంగు తిన్నాడు హీరో. ఇక చివర్లో హీరో కాబోయే మామగారి కాళ్లు కడగడంతో.. ఎదవ... ఎదవ సన్నాసి నువ్వు కాదు.. ఆళ్లు నీ కాళ్ళు కడగాలి.. నా పరువు తీసేస్తున్నాడు ఈడు అంటూ రావు రమేష్ విసుక్కుంటాడు. అయితే గణేష్ మాత్రం.. కాళ్ళు ఎవరు కడిగితే ఏంటి నాన్న అని బదులివ్వడం నవ్వు పుట్టిస్తోంది. పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment