‘‘యుక్త వయసులో అబ్బాయి మనస్తత్వం, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలపై ‘సెహరి’ తీశాం. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా మా సినిమా ఉంటుంది. మా చిత్రం చూసిన ప్రేక్షకులు థియేటర్ల నుంచి నవ్వుతూ బయటికొస్తారు’’ అని దర్శకుడు జ్ఞానశేఖర్ ద్వారక అన్నారు. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సెహరి’. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా జ్ఞానశేఖర్ ద్వారక మాట్లాడుతూ– ‘‘నాది చిత్తూరు జిల్లా పలమనేరులోని వి.కోట. ఎంఎస్సీ చదివాను. ఆరేళ్లుగా దాదాపు 70కి పైగా యాడ్ ఫిల్మ్స్ తీశా. డైరెక్టర్‌గా ‘సెహరి’ నా మొదటి చిత్రం. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో హర్ష్ ఈజ్, టైమింగ్ బాగుంటుంది.. త్వరలోనే తను పెద్ద స్టార్ అవుతాడు. ‘సెహరి’ అంటే సెలబ్రేషన్ (వేడుక). హీరో తండ్రి పాత్రకి కోటిగారి పేరును అద్వయగారే సూచించారు. అరవింద్ విశ్వనాథ్ కొత్తవాడైనా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ప్రశాంత్ విహారి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. నేను రచయితను కూడా. పీరియడ్ డ్రామా, యాక్షన్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. నా తర్వాతి చిత్రం హర్ష్‌తోనే ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment