![Gudibandi Venkata Sambi Reddy About Gangs Of 18 Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/26/gangs-of-18.gif.webp?itok=Z2oBt0Bz)
మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో శంకర్ రామకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘పదినెట్టామ్ పడి’. ఈ సినిమాని ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ పేరుతో తెలుగులోకి అనువదించారు. శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్‌పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నేడు తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న నేను తొలిసారి అలీ హీరోగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ నిర్మించా. ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాను. ‘నా స్కూల్ డేస్’ అనే ట్యాగ్‌లైన్‌తోనే సినిమా కథ ఏంటో చెప్పాం. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది? వాళ్లు ఏ స్థాయికి చేరుకుంటారు? అనే సందేశం ఈ సినిమాలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో ఒక స్ట్రయిట్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment