sambi reddy
-
ఈదా సాంబి రెడ్డికి జగన్ పరామర్శ
-
పసుపు రైతులకు ఇచ్చేది రూ.7 వేలే!
తెనాలి: గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పసుపు నిల్వలను నష్టపోయిన రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత మార్కెట్లో ధరను దృష్టిలో పెట్టుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని పసుపు రైతుల సంఘం కోరింది.బీమా పరిహారం కలిపి క్వింటాల్‌కు రూ.7 వేలకు మించి ఇవ్వలేమని సర్కారు చేతులెత్తేసింది. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ ప్రఖర్‌జైన్‌ను పసుపు శివసాంబిరెడ్డి, పలువురు రైతులు కలిశారు. శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం విజయవాడ మార్క్‌ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు, అధికారులు కోల్డ్ స్టోరేజీ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందం సంతకాలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని కోరినట్టు చెప్పారు.బీమా పరిహారంతో కలిపి రూ.7 వేలకు మించి ఇవ్వలేమని మంత్రి వెల్లడించగా.. రైతులు అయిష్టంగానే అంగీకరించారని తెలిపారు. దీనివల్ల పసుపు రైతులు రూ.20 కోట్లు నష్టపోయినట్టు శివసాంబిరెడ్డి, చందు సత్యనారాయణ తెలియజేశారు. చర్చల్లో బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, దేవభక్తుని నాగ వీరబసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు, గద్దె శ్రీహరి, భీమవరపు సీతారామిరెడ్డి, బొల్లిమంత రామారావు, తుంగల వీరరాఘవులు పాల్గొన్నట్టు వివరించారు. -
ఫస్ట్ సినిమా అలీతో, ఇప్పుడు డబ్బింగ్ మూవీ, తర్వాత..
మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో శంకర్ రామకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘పదినెట్టామ్ పడి’. ఈ సినిమాని ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ పేరుతో తెలుగులోకి అనువదించారు. శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్‌పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నేడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న నేను తొలిసారి అలీ హీరోగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ నిర్మించా. ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాను. ‘నా స్కూల్ డేస్’ అనే ట్యాగ్‌లైన్‌తోనే సినిమా కథ ఏంటో చెప్పాం. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది? వాళ్లు ఏ స్థాయికి చేరుకుంటారు? అనే సందేశం ఈ సినిమాలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో ఒక స్ట్రయిట్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది’’ అన్నారు. -
రోజుకో సినిమా చూసి గానీ పడుకునే వాన్ని కాదు: నిర్మాత
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, ఆర్య, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'పడి నెట్టం పడి'. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని 'గ్యాంగ్స్ ఆఫ్ 18' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాలను పంచుకున్నారు నిర్మాత గుదిబండ వెంకట సాంబి రెడ్డి. సినిమాపై ఆసక్తితో.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు స్థాపించాను. సినిమా రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందులో భాగంగానే తొలి సినిమాగా 'పండుగాడి ఫొటోస్టూడియో' చిత్రం నిర్మించాను. దాని తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. సందేశాత్మకంగా ఉంటుంది.. మీరు గమనించినట్లయితే ‘'గ్యాంగ్స్ ఆఫ్ 18' సినిమాకు 'నా స్కూల్ డేస్' అనే ట్యాగ్‌లైన్‌తోనే సినిమా స్టోరి ఏంటో చెప్పాం. స్టూడెంట్ దశ గురించి ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది. జీవితంలో వాళ్లు ఎంత ఎత్తుకు ఎదగగలరు అనే చక్కటి సందేశం ఈ సినిమాలో ఉంటుంది. అలాగే ప్రభుత్వ కళాశాలకు చెందిన స్టూడెంట్స్‌ను కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ చిన్న చూపు చూడటం. ఇలాంటి క్రమంలో ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంత్రితో పందెం కట్టడం ఆ విద్యార్థులు ఆ పందెంలో ఎలానెగ్గారు. చివరికి ఆ మంత్రి ఏం చేశాడు. అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో కొత్తగా, ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు మలిచిన తీరు అత్యద్భుతం అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక ఆచార్యుని పాత్రలో మమ్ముట్టి గారు అద్భుతమైన నటన కనబరిచారు. అతను స్టూడెంట్స్‌ని ఇన్స్పైర్ చేసే విధానం గానీ, వారి అభివృద్దికి తోడ్పడే అంశాలుగానీ నిజ జీవితంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్‌తో పాటు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కచ్చితంగా చూసి తీరాల్సిన అవసరం ఉంది. ఆ అంశాలు అదనపు ఆకర్షణ వర్షంలో వచ్చే బస్సు ఫైట్, సైకిల్ మీద ఫైట్ అలాగే ఏఆర్ రహమాన్ మేనల్లుడు ఏహెచ్ కాశీఫ్ అద్భుతమైన ఐదు పాటలు కంపోజ్ చేశారు. ప్రతి పాట ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేశాం. యూట్యూబ్‌లో ఆ సాంగ్ చాలా బాగా ట్రెండ్ అవుతోంది. సంగీతంతో పాటు సినిమాటోగ్రఫీ, దర్శకుడి టేకింగ్, మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ నటన సినిమాకు హైలెట్‌గా నిలిచే అంశాలు. అలాగే బాహుబలి చిత్రానికి పని చేసిన కెచ్చ ఈ చిత్రానికి అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ ఫైట్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు సినిమాలానే.. చైతన్య ప్రసాద్, శ్రేష్ణ, కృష్ణ మాదినేని ఇందులో పాటలు రాశారు. అలాగే మైథిలి కిరణ్, దీపిక రావ్ సంభాషణలు సమకూర్చారు. అందరూ కలిసి డబ్బింగ్ సినిమాలా కాకుండా తెలుగు స్ట్రయిట్ సినిమాలా ఎంతో క్వాలిటీ వర్క్ ఇచ్చారు. మా బ్యానర్లో మరిన్ని.. ప్రస్తుతం తెలుగులో ఒక స్ట్రయిట్ ఫిలిం ప్లాన్ చేశాను. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే వెబ్ సిరీస్ కూడా తీయాలన్న ఆలోచన ఉంది. ఇలా కంటిన్యూయస్‌గా మా బ్యానర్లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రోజుకో సినిమా చూసి.. పడుకునే ముందు రోజుకో సినిమా చూసి కానీ పడుకోను. ఇటీవల ఓటీటీ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు చాలా చూస్తున్నా. యంగ్ జనరేషన్ అంతా మంచి కథాంశంతో వస్తున్నారు. కచ్చితంగా న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాను. మంచి ఆడియో ఉండేలా.. ఏ జానర్ తీసుకున్నా కూడా కథ, కథనాలు ఆసక్తికరంగా, బోర్ కొట్టించకుండా, తర్వాత ఎలా ఉంటుంది? అనేలా ఉండాలి. అప్పుడే నాకు ఆ సినిమా నచ్చుతుంది. నాకు మాత్రమే కాదు ప్రేక్షకులు అంతా కూడా ఇలా ఉంటేనే ఇష్టపడారు. కాబట్టి మంచి స్క్రిప్ట్, చక్కటి సన్నివేశాలు, ఆకట్టుకునే పాటలు ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఒక్క పాట హిట్ అయినా ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. మా తదుపరి సినిమాల్లో మంచి ఆడియో ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం. చివరిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని వెంకట సాంబిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
చొక్కా పట్టుకు లాక్కెళ్లారు...
-
మా టీచరమ్మ దయవల్ల..
అరచేతిని తిరగేయమని వేళ్ల ముడుసులపై చెక్క స్కేలుతో కొడుతుంటే.. టీచరమ్మపై భలే కోపం వచ్చేది. అదే టీచరు మధ్యాహ్నం భోజనం సమయంలో పక్కన కూర్చోబెట్టుకుని ఆమె తెచ్చుకున్న కూరలేసి అన్నం పెట్టినపుడు అమ్మ గుర్తుకొచ్చేది. ఆ టీచర్ పేరు ఆరోగ్యమ్మ. ఓనమాలు నేర్చుకున్నప్పటి నుంచి ఆమె కన్నుమూసేవరకూ ఆమెతో నాకు అనుబంధం కొనసాగింది. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రైమరీ స్కూల్లో నన్ను చేర్చేసరికి ఆ స్కూల్లో ఆరోగ్యమ్మ టీచర్ ఒక్కరే ఉన్నారు. అంటే సింగిల్ టీచర్ స్కూలన్నమాట. మా నాన్నగారు సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. ఇన్స్పెక్టర్ గారి అబ్బాయినని మిగతావారంతా కాస్త గారంగా చూసేవారు. పైగా ఇంట్లో నేనే పెద్దవాడ్ని. నాకు పన్నెండో ఏటప్పుడు చెల్లి పుట్టింది. అప్పటివరకూ ఇంట్లో, బయటా నేనే హీరోని. మా టీచరమ్మ దగ్గర మాత్రం ఎలాంటి పప్పులు ఉడికేవి కావు. అక్షరం నేర్పే దగ్గర ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఆమె ఒక్కరే అన్ని క్లాసులు చెప్పేవారు. నా జీవితంపై ఆరోగ్యమ్మ టీచర్ ప్రభావం చాలా ఉంది. నిజంగా ఆమె చాలా గొప్ప మనిషండి. ఐదోతరగతి తర్వాత నేరుగా ఎనిమిదో తరగతిలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఆ పరీక్షకు నన్ను ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడింది. ఆమె కోరుకున్నట్టే నేను పరీక్ష బాగా రాసి రంగనాయకులపేటలోని హైస్కూల్లో చేరాను. ఆ తర్వాత కూడా ఆమెను కలుస్తుండేవాడ్ని. నేను పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీలో చేరాను. అక్కడ టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం నాపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు నేను, నా స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశాం. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. నా స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. నేను మాత్రం చాలా ఫీలయ్యాను. మూడురోజులు బెంగపెట్టుకున్నాను. ఆ బాధ, కసి కారణంగానే నేను నటుణ్ణయ్యాను. ఒకవేళ మా గుండాచారి మాస్టారు నేను చెప్పిన డైలాగులు విని బాగానే ఉన్నాయంటే.. నా యాక్టింగ్ పార్ట్ అక్కడితోనే ముగిసిపోయేదేమో. టీచరయ్యాక కూడా... నేను బీఎస్సీ బీఎడ్ పూర్తిచేశాక గుంటూరు మున్సిపల్ హైస్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. పాతికేళ్ల పాటు టీచర్‌గా పనిచేశాను. తర్వాత ఐదేళ్లు హెడ్మాస్టర్గా చేసి ‘నర్సింహనాయుడు’ సినిమా టైమ్‌లో రిటైర్ అయ్యాను. టీచర్‌గా ఉద్యోగం వచ్చాక కూడా అప్పుడప్పుడు మా ఆరోగ్యమ్మ టీచర్ని చూడ్డానికి నెల్లూరు వెళ్లేవాడ్ని. చిన్ననాటి విషయాలు జ్ఞాపకం చేసుకునేవాడ్ని. పదేళ్లక్రితం ఆమె చనిపోయినపుడు వెళ్లాను. ఆ సమయంలో నేను బాధపడింది.. ఓనమాలు నేర్పిన గురువుకి దూరమైనందుకే కాదు.. ఆమె చిన్నప్పుడు పెట్టిన అన్నం ముద్దల అనురాగానికి కూడా! ..:: భువనేశ్వరి