
Hansika's 'My Name Is Shruthi' Movie: హన్సిక లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. బురుగు రమ్యాప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బురుగు రమ్యాప్రభాకర్ మాట్లాడుతూ–‘‘అవయవాల మాఫియా నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా మలిచాడు దర్శకుడు.
చదవండి: షాకింగ్.. నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్
టీజర్‌తో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాని రిలీజ్ చేయనున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయి’’ అన్నారు శ్రీనివాస్ ఓంకార్.