నిఖిల్‌కు పోలీసులు షాక్‌.. అలా చెప్పిన వదల్లేదంటూ ట్వీట్‌ | Hero Nikhil Stopped By Hyderabad Cops During Medicine Run | Sakshi
Sakshi News home page

Nikhil: తొమ్మిది సార్లు ప్రయత్నించినా విఫలం.. నిఖిల్‌ ఆసహనం

Published Sun, May 23 2021 4:33 PM | Last Updated on Sun, May 23 2021 7:32 PM

Hero Nikhil Stopped By Hyderabad Cops During Medicine Run - Sakshi

Nikhil:కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు చూసి చూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు... సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నేటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేశారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సేవలను కూడా అనుమతించడం లేదు. తాజాగా ఈరోజు అత్యవసరమైన వైద్య సామాగ్రి పంపిణీ చేయడానికి వెళ్లిన హీరో నిఖిల్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.  ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘కొవిడ్‌ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు. ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ  పోలీసులు నాకు అనుమతి ఇవ్వలేదు. ఈ పాస్‌ ఉండాల్సిందేనని చెప్పారు.  

9 సార్లు ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని భావించి నేను వచ్చాను’అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. నిఖిల్‌ ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం.. ‘డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం’అని రిప్లై ఇచ్చింది.

చదవండి:
దీన్ని ప్రేమంటారా? సిగ్గుపడండి: నిర్మాత ఫైర్‌ 
ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్‌ ఫోటో షూట్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement