Hero Rajasekhar Demands Shocking Remuneration For Gopichand Film - Sakshi
Sakshi News home page

గోపీచంద్ మూవీ కోసం హీరో రాజశేఖర్‌కి భారీ రెమ్యునరేషన్‌!

Aug 15 2021 4:00 PM | Updated on Aug 15 2021 9:23 PM

Hero Rajasekhar Demands Shocking Remuneration For Gopichand Film - Sakshi

తనదైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజశేఖర్‌. ఇప్పుడంటే ఆయనకు పెద్దగా మార్కెట్‌ లేదు కానీ 20 ఏళ్ల క్రితం ఆయన వరుస విజయాలతో చాలా రికార్డులు సృష్టించాడు. ఒకప్పుడు తెలుగులో భారీ పారితోషికం అందుకున్న హీరోల్లో రాజశేఖర్ కూడా ఉన్నాడు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. చిరంజీవి లాంటి హీరోలతో కూడా రాజశేఖర్ పోటీ పడిన సందర్భాలున్నాయి. అయితే ఆ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడడంతో ఈ యాంగ్రీ హీరో కాస్త డీలా పడ్డాడు. ఆ తర్వాత ‘గరుడ వేగ’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. అనంతరం ‘కల్కి’తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్‌ తీసుకున్న ఈ సీనియర్‌ హీరో..  ఇటీవలే ‘శేఖర్‌’ అనే సినిమాను ప్రకటించాడు.

తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రాజ శేఖర్‌ భారీ పారితోషికం డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో హీరో సోదరుడి పాత్ర చాలా కీలకం. రాజశేఖర్ అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావించారు. రాజశేఖర్‌ కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెబుతూ కొన్ని కండీషన్స్‌ పెట్టాడట. ఈ మూవీకి రూ. 4 కోట్లు పారితోషికంగా ఇవ్వాలని, అంతేకాకుండా తన పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉండేలా చూడాలని షరతులు విధించాడట. దీనికి నిర్మాతలు కూడా అంగీకారం తెలిపారట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement