‘‘నా సినిమా థియేటర్‌లో రిలీజై రెండేళ్లు దాటింది. అయినా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం రీ రిలీజ్‌కి ఫ్యాన్స్ చూపించిన స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ‘కంగువ’ లాంటి గొప్ప సినిమా చేశాను. మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అరుదైన మూవీ చేశాం’’ అని హీరో సూర్య అన్నారు. శివ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘కంగువ’ నవంబరు 14న విడుదల కానుంది.
ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సూర్య మాట్లాడుతూ–‘‘కంగువ’లాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళిగారు స్ఫూర్తినిచ్చారు. నటుడిగా కమల్‌హాసన్‌గారిని చూసి స్ఫూర్తి పొందుతుంటాను. ‘కంగువ’ స్ట్రయిట్ తెలుగు సినిమా... ఇండియన్ సినిమా. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం ΄పోరాడే వీరుడి చిత్రమిది. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నా ‘కాక్క కాక్క’ సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ‘జై భీమ్’ సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి’’ అని తెలిపారు.
శివ మాట్లాడుతూ– ‘‘కంగువ’ సినిమాను ఎంతోఫ్యాషన్‌తో సూర్యగారి లాంటి ఎక్స్‌ట్రార్డినరీ హీరోతో కలిసి రూపొందించాను. మన దక్షిణాది సినిమాని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలో రాజమౌళిగారు చూపించారు. నాకు ఆయన ఎంతో స్ఫూర్తినిస్తారు. ఆయన ‘విక్రమార్కుడు’ సినిమాని తమిళంలో ‘సిరుతై’గా రీమేక్ చేశాను. ఆ సినిమాతో నా ఇంటి పేరు ముందు ‘సిరుతై’ చేరింది’’ అని పేర్కొన్నారు. ‘‘కంగువ’ కోసం టీమ్ అంతా ఎంతోఫ్యాషనేట్‌గా హార్డ్‌వర్క్ చేశాం. మా సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అని చె΄్పారు కేఈ జ్ఞానవేల్ రాజా. రచయిత, నటుడు రాకేందు మౌళి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment