Heroine Rambha Daughter Lavanya Indrakumar Latest Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Rambha:హీరోయిన్‌ రంభ కూతురిని చూశారా? అచ్చం తల్లిలాగే ఉందిగా!

Published Wed, May 24 2023 9:41 AM | Last Updated on Wed, May 24 2023 10:45 AM

Heroine Rambha Daughter Laanya Indrakumar Pics Goes Viral - Sakshi

అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్లలో రంభ ఒకరు. ఒకప్పుడు తెలుగు తెరపై టాప్‌ హీరోయిన్‌గా దుమ్ము రేపింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, బెంగాలీ.. ఇలా అన్ని ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. రాజేంద్ర ప్రసాద్‌ ‘ ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రంభ.. తక్కువ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోస్ అందరితోనూ కలిసి నటించింది.

ఇక 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను వివాహం చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 

సినిమాలకు దూరమైనా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటారు రంభ. తాజాగా తన పెద్ద కూతురు లాన్య ఇంద్రకుమార్‌ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అచ్చ తెలుగు ఆడపిల్లగా ముస్తాబైన ఆ లాన్య ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘అచ్చం మీలాగే ఉంది’. ‘స్కూల్‌ డేస్‌ రంభలా ఉంది’ అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement