
లావెక్కింది, బండలా తయారైంది అంటూ వాళ్లను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. వీరసింహారెడ్డి సెన్సేషన్ హనీ రోజ్ కూడా ఇలాంటి ట్రోలింగ్‌కే గురైంది. తనపై కుళ్లు జోకులు వేసుకుని
ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా ఉంటే కూడా ఇష్టపడేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం లావెక్కింది, బండలా తయారైంది అంటూ వాళ్లను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. వీరసింహారెడ్డి సెన్సేషన్ హనీ రోజ్ కూడా ఇలాంటి ట్రోలింగ్‌కే గురైంది. తనపై కుళ్లు జోకులు వేసుకుని నవ్వుకునేవారని, అది చూసినప్పుడు తనకు ఎంతో బాధేసేదని చెప్పుకొచ్చింది.
💃💃💃 pic.twitter.com/nVlUz3Hzko
— Honey Rose OfficiaI (@HoneyRoseOffl_) May 29, 2023
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని మనసు నొప్పిస్తాయి. నా శరీరాకృతి గురించి నోటికొచ్చినట్లు వాగుతుంటే ఎంతో బాధేసేది. ఇప్పుడిప్పుడే అలాంటివాటిని పట్టించుకోవడం మానేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ టీవీ షోకు వెళ్లినప్పుడు అక్కడ నన్ను బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు.
అది విని షో యాంకర్ పగలబడి నవ్వింది. మహిళా యాంకరే నా మీద వస్తున్న కామెంట్లు విని నవ్వడం నాకస్సలు నచ్చలేదు. పైగా ఓ కమెడియనే నా బాడీ గురించి ఏదేదో వాగాడు. ఇలా బాడీ షేమింగ్ చేస్తుంటే దాన్ని టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది హనీరోజ్.
How's it? 💃👗 pic.twitter.com/YaGukKGoCl
— Honey Rose OfficiaI (@HoneyRoseOffl_) May 29, 2023
చదవండి: అహింస మూవీ రివ్యూ