Honey Rose Rachel Movie First Look Goes Viral, Netizens Are On Fire Saying Ban Her Movies - Sakshi
Sakshi News home page

Honey Rose Rachel First Look: హనీరోజ్‌ హాట్‌ లుక్‌ దెబ్బకు సినిమాను బ్యాన్‌ చేయాలంటూ..

Published Sat, Jul 15 2023 12:05 PM | Last Updated on Sun, Jul 16 2023 2:13 PM

Honey Rose Rachel Movie First Look Viral Ban For Netizens - Sakshi

మొదట్లో బాలయ్య 'వీరసింహారెడ్డి' హీరోయిన్ హనీరోజ్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.. తర్వాత టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ చేసుకుని తాజాగా కుర్రాళ్ల గుండెళ్లో చెరగని ముద్రే వేసింది.  తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ.. ఇప్పడు పాన్ ఇండియా మూవీ ‘రాహేలు'లో ఓ ప్రధాన పాత్రను పోషిస్తుంది.

(ఇదీ చదవండి: అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్‌ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్‌)

ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్‌ని మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. ఈ లుక్‌లో హనీరోజ్ భయపెడుతూనే.. కుర్రకారుకి కావాల్సిన హాట్‌ ఫోజులతో రెచ్చగొడుతుంది. 'రాహేలు' ఫస్ట్ లుక్‌లో హనీరోజ్‌ కత్తి పట్టుకుని బీఫ్‌ మాంసం కొడుతోంది. విజువల్స్‌లో ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి. అక్కడ సీరియస్ లుక్‌లో కత్తిపట్టుకొని హనీరోజ్ ఆకర్షిస్తూ.. గ్లామరస్ యాంగిల్‌ని తెలియజేస్తోంది. ఆమె బీఫ్ అమ్మే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ క్రైమ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌లో సినిమా రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో పైట లేకుండా హనీ రోజ్ కనిపించిన తీరు కంటే.. బీఫ్ మీదే నెటిజన్ల ద‌ృష్టి పడింది.  ఈ చిత్రాన్ని బ్యాన్ చేయండి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి చిత్రయూనిట్ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement