విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ మరింత పెరిగిందనండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా పెళ్లి, విడాకుల వంటి సంఘటనల అనంతరం హీరోయిన్లకు ఆఫర్స్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతుంటాయి. కానీ సమంత విషయంలో ఇది తప్పని రుజువైంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్‌తో ఆఫర్లు అందుకున్న సామ్ విడాకులు అనంతరం కూడా వరస అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరజనకు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ ఇంటర్నేషనల్ మూవీ కూడా ఉండటం విశేషం.
చదవండి: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
సినిమాల పరంగానే కాదు ఇటూ బిజినెస్‌లోనూ సమంత దూకుడు పదర్శిస్తోంది. ఇదిలా ఉంటే విడాకులు అనంతరం సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో చాలా బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు సమంత ఇన్‌స్ట్రాగ్రామ్‌ను వేదికగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో సామ్‌కు వాణిజ్య ప్రకటనల డిమాండ్ పెరిగిపోయింది. తద్వారా తను పెట్టే ప్రతి పోస్ట్‌కు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు సామ్ డిమాండ్ చేస్తోందని సమాచారం.
చదవండి: ఆనందం పట్టలేక సోషల్ మీడియాలో పంచుకున్న సమంత
ఇది కేవలం పోస్ట్‌లకు మాత్రమే ఒకవేళ ప్రత్యేకించి ఏమైన ఫొటోషూట్స్, వీడియోలు చేయాల్సి వస్తే వాటికి అదనంగా రెండు నుంచి మూడు రెట్లు డిమాండ్ చేస్తోందని వినికిడి. అంతేకాదు ఆ బ్రాండ్‌లు తన కాల్‌షీట్స్‌ను కొనుగోలు చేయడమే కాదు, ఎండోర్స్‌మెంట్స్‌కు కూడా స్పెషల్ చెల్లింపులు ఉంటాయట. ఈ క్రమంలో బ్రాండ్‌ను బట్టి సామ్ కోటీ రూపాయల నుంచి 2 కోట్ల వరకు అందుకుంటుందని సమాచారం. ఈ లెక్కన సమంత సినిమాల పరంగానే కాదు.. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కూడా కోట్లు గడిస్తూ బాగానే వెనకేసుకుంటోందని నెటిజన్లు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment