
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడుస్తున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. తన అందం, అభినయంతో దాదాపు 15 ఏళ్లుగా అభిమానులను ఆకట్టుకుంటూ 50కి పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈ భామ గోపిచంద్ హీరోగా తెరకెక్కతున్న సీటీమార్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సత్యదేవ్‌తో జోడీ కట్టి ‘గుర్తుందా శీతాకాలం’లోనూ కనిపించనున్నారు. ఇక ఇటీవల తమన్నా సమంత అక్కినేని హోస్ట్‌గా తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమవుతున్న సామ్‌జామ్‌లో పాల్గొన్నారు. ఈ షోలో సమంతతో కలిసి సందడి చేశారు. తమన్నాతోపాటు ఆమె స్టంట్స్ ట్రైనర్స్ కోమల్, షాలిని, దర్శకురాలు నందిని రెడ్డి ఎంట్రీ ఇచ్చి అలరించారు. చదవండి: 30% చనిపోయే అవకాశం ఉందన్నారు: రానా కంటతడి
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ఆహాలో విడుదల చేశారు. ఇందులో ర్యాపిడ్ ఫైర్ అంటూ సామ్, తమన్నాను కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఒకవేళ నో కిస్సింగ్ ఆన్ స్క్రీన్ బ్రేక్ రూల్ చేస్తే.. ఎవరితో కిస్ చేయాలనుకుంటున్నావని అడగ్గా.. విజయ్ దేవరకొండతో కిస్ చెయ్యాలని ఉందని చెప్పారు తమన్నా. దీంతో వెంటనే ప్రేక్షకులు చప్పట్లతో గోలగోల చేశారు. అయితే గ్లామర్ రోల్స్ విషయంలో వెనుకాడని తమన్నా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ హీరోకూ లిప్‌లాక్ ఇవ్వలేదు. కానీ గతంలోనూ ఓ షోకు హాజరైన తమన్నాకు ఇదే ప్రశ్న ఎదురైతే ఆమె హృతిక్ రోషన్ పేరు చెప్పింది. చదవండి: తమన్నా రాకతో గ్రాఫ్ మారిపోయింది
అదే విధంగా అఖిల్ గురించి మాట్లాడుతూ.. నీకంటే తను కొంచెం యంగ్ అయిపోయాడు అని సమంత అనడంతో వెంటనే లవ్‌కి వయస్సుతో సంబంధం లేదని మిల్కీ బ్యూటీ సమాధానం చెప్పేసింది. కావాలంటే తాను మీటింగ్ ఏర్పాటు చేస్తానని, వాళ్ల నాన్నతో కూడా మాట్లాడతానని సమంత సరదాగా ఆటపట్టించారు. ఈ ఎపిసోడ్ ఈరోజు(డిసెంబర్ 11) ఆహాలో ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment