
ప్రముఖ సంగీత సందర్శకుడు ఇళయరాజా సంగీతం అంతరిక్షంలోనూ మారుమోగనుంది. అవును ఇది నిజం. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థుల బృందం అత్యంత చిన్న శాటిలైట్ తయారు చేస్తోంది. దీనిని భారతదేశ 75వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న నాసా సహకారంతో అంతరిక్షంలోకి పంపనున్నారు.
విశేషమేమిటంటే ఈ శాటిలైట్‌లో.. మనదేశం గొప్పతనాన్ని తెలియజేస్తూ గీత రచయిత స్వనంద్ కిర్కిరే రాసిన హిందీ పాటను వినిపించనున్నారు. కాగా ఈపాటకు ఇళయరాజా బాణీలు కట్టడానికి అంగీకరించడం, తమిళ వెర్షన్‌ను ఆలపించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అలా ఇళయరాజా సంగీతం ఆకాశ తరంగాలను మీటనుంది.
Comments
Please login to add a commentAdd a comment