ఆ పాటకు ఇండోనేషియా యూట్యూబర్‌ స్టెప్పులు.. వీడియో వైరల్‌ | Indonesian Youtuber Dances On Akshay Kumar's NazaNaza Song | Sakshi
Sakshi News home page

Viral Video: బాలీవుడ్ పాటకు యూట్యూబర్‌ స్టెప్పులు.. అద్భుతమని అక్కీ ప్రశంసలు

Published Sat, Dec 4 2021 4:45 PM | Last Updated on Sat, Dec 4 2021 4:46 PM

Indonesian Youtuber Dances On Akshay Kumar's NazaNaza Song - Sakshi

Indonesian Youtuber Dances On Akshay Kumar's NazaNaza Song: కరోనా కల్లోలం తర్వాత థియేటర్లలో అడుగు పెట్టిన మొదటి బాలీవుడ్‌ చిత్రం 'సూర్యవంశీ'. బాలీవుడ్‌ యాక్షన్ హీరో అక్షయ్‌ కుమార్‌, కత్రీనా కైఫ్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రల్లో మెరిశారు. రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బ‍్లస్టర్‌గా నిలిచింది. డిసెంబర్‌ 3, 2021న ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదలైంది. అయితే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలు కూడా ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా 'నాజానాజా' పాటకు అక్కీ, కత్రీనా వేసిన స్టెప్పులు సినీ ప్రియులను చాలా ఆకట్టుకున్నాయి. 

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ పాటను నెటిజన్లు రీక్రియేషన్, స్ఫూప్‌లు చేస్తూ ఇన్‌స్టా  గ్రామ్‌ రీల్స్‌, షార్ట్స్‌ చేస్తున‍్నారు. తాజాగా ఈ పాటకు ఇండోనేషియాకు చెందిన ఓ యూట్యూబర్‌ జంట అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. సేమ్ అక్కీ-కత్రీనాలను అనుకరిస్తూ, సేమ్ వారి కాస్ట్యూమ్స్‌ ధరించి స్టెప్పులేశారు. కాగా వారు చేసిన డ్యాన్స్‌ వీడియోకు అక్షయ్‌ కుమార్‌ కూడా ఆశ్చర్యపోయాడు. ఈ ఇండోనేషియా జంట చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేశాడు. 'మీ రీక్రియేషన్‌ నాకు బాగా నచ్చింది. అద్భుతమైన ప్రయత్నం.' అంటూ పోస్ట్‌ చేశాడు అక్కీ. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

'నాజానాజా' పాటకు స్టెప్పులేసిన వినఫాన్‌ అనే యూట్యూబర్ ఇండోనేషియాలో చాలా పాపులర్‌. బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు. అందులో భాగంగానే సూర్యవంశీలోని 'నాజానాజా' పాటను రీక్రియేట్‌ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోకు 3.6 లక్షల వ్యూస్‌ వచ్చాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement