Good Luck Jerry: మొదటి సినిమాతోనే స్టార్‌డమ్ తెచ్చుకోవడం అంత ఈజీయేం కాదు. టాలెంట్‌తో పాటు కొంత లక్ కూడా ఉన్నప్పుడే అది కలిసొస్తుంది. అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అయితే ఫస్ట్ సినిమా ధడక్‌తోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టిన జాన్వీ నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా థియేటర్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ కానుందంటూ బీటౌన్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సినిమా హక్కులను హాట్‌స్టార్ సొంతం చేసుకుందని టాక్. త్వరలోనే హాట్‌స్టార్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా 'గుడ్ లక్ జెర్రీ' తమిళ చిత్రం 'కోలమావు కోకిల' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. మూల కథలో నయనతార పోషించిన రోల్‌ను హిందీలో జాన్వీకపూర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment