Suma Kanakala: చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘జయమ్మ పంచాయితీ’(Jayamma Panchayathi)అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ కూడా చాలా వెరైటీగా ఉంది.
విభిన్న అంశాలతో కూడిన పోస్టర్‌లో గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించారు. పోస్టర్‌ని బట్టి చూస్తే, సినిమాలో సుమ ఓ పల్లెటూరిపెద్ద పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి ఇంప్రెషన్ తెచ్చింది.. 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది సుమ. మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ గా సుమ సినిమా రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment