
జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి బర్త్‌డేకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మార్చి 18న లక్ష్మి ప్రణతి పుట్టినరోజు వేడుకలు జురుపుకుంది. ఈ నేపథ్యంలో తన అర్ధాంగికి విలువైన కానుకను సమర్పించాడట హీరో. సిటీలో ఓ పెద్ద ఫామ్ హౌస్‌ను భార్య పేరిట రాయించాడట. ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అదే ఫామ్‌హౌస్‌లో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇచ్చిన కానుకకు ప్రణతి ఎంతో సంతోషించినట్లు తెలుస్తోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ 2011 మే 5న ప్రణతి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ దంపతులు 2014లో అభయ్ రామ్‌కు, 2018లో భార్గవ్ రామ్‌కు జన్మనిచ్చారు.
ఇదిలా వుంటే అభిమానుల ప్రేమకు తానెప్పుడూ దాసోహమే అని చెప్తుండే ఎన్టీఆర్‌కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం నాడు ఆయన తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో కొందరు అభిమానులు స్టేజీ పైకి దూసుకొస్తూ తారక్‌ను కాసేపటివరకు ఉక్కిరిబిక్కిరి చేశారు. అభిమానుల అత్యుత్సాహంపై ఎన్టీఆర్ కాస్త అసహనం ప్రదర్శించాడు.
చదవండి: నా కష్టసుఖాల్లో ఉన్నది ఆ ఇద్దరే: ఎన్టీఆర్
తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో!
Comments
Please login to add a commentAdd a comment