Is Jyothi Rai Tie Knot to Suku Purvaj? - Sakshi
Sakshi News home page

Jyothi Rai: రెండో పెళ్లి చేసుకున్న సీరియల్‌ నటి.. ఇదే సాక్ష్యం?

Published Sun, Jul 30 2023 7:53 AM | Last Updated on Sun, Jul 30 2023 11:37 AM

Is Jyothi Rai Tie Knot to Suku Purvaj - Sakshi

జ్యోతి రాయ్‌ అంటే గుర్తుపడతారో లేదో కానీ గుప్పెడంత మనసు సీరియల్‌ జగతి అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఈ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది. సీరియల్‌లో సాంప్రదాయ కట్టుబొట్టుతో పద్ధతిగా కనిపించే ఆమె సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఇకపోతే ఈ మధ్య జ్యోతి రాయ్‌ పేరు నెట్టింట మార్మోగిపోతోంది. అందుకు కారణం.. యువ దర్శకుడితో ఎఫైర్‌ పెట్టుకోవడమే!

జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. మరి ఏమైందో ఏమో కానీ ఈ నటి తన భర్తను వదిలేసి ఓ యువదర్శకుడితో ప్రేమలో ఉందని పుకారు షికారు చేస్తోంది. మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఈ పుకార్లు మరింత పుంజుకున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వెలువడ్డాయి.

తాజాగా మరోసారి ఈ అనుమానాలకు ఊతమిచ్చే పని చేసింది జ్యోతి రాయ్‌. ఈమె కొత్తగా ట్విటర్‌ ఖాతా తెరిచింది. ప్రియుడు పేరు సుకుపుర్వాజ్‌ను తన పేరులో జోడిస్తూ జ్యోతి పుర్వాజ్‌ అని తన ఖాతాకు కొత్త పేరు పెట్టుకుంది. నిజానికి పెళ్లయ్యాక పేరు చివరన భర్త పేరు పెట్టుకుంటారు. ఈ లెక్కన జ్యోతి-సుకుపుర్వాజ్‌ పెళ్లయిపోయినట్లే కనిపిస్తోంది. మరి నిజంగానే జ్యోతిరాయ్‌ రెండో పెళ్లి చేసుకుందా? లేదంటే ప్రియుడి ప్రేమలో మునిగి తేలుతున్న క్రమంలోనే తన పేరు చివరన అతడి పేరును జోడించిందా అనేది తెలియాల్సి ఉంది.

కర్ణాటకలో పుట్టిపెరిగిన జ్యోతిరాయ్ మంగళూరులో చదువుకుంది. 'బందె బరాటవ కాలా' సీరియల్‌ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్‌.. తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించింది. సీరియల్స్‌తో పాటు 'సీతారామ కళ్యాణ', 'గంధాడ్ గుడి', '99', 'దియ వర్ణపాటల' సినిమాల్లో నటించింది. ఈ మధ్య వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తోంది.

చదవండి: ఆ సినిమాకు రూ.250 కోట్లా? జనాలను పిచ్చోళ్లు చేస్తున్నారు: కంగనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement