![Kajal Agarwal Reveal Her Movie Care Taker - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/ka.jpg.webp?itok=mdt72CWN)
నటిగా, భార్యగా, తల్లిగా పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా మళ్లీ నటిగా కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికీ కథానాయకిగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె తమిళంలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్ సరసన నటిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణకు జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ భామ ఒక ఇంటర్వ్యూలో తన గురించి పేర్కొంది.
(ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)
సాధారణంగా ప్రారంభమైన తన సినీ జీవితం ఆ తర్వాత పెద్దపెద్ద స్టార్స్‌తో నటిస్తూ ఇప్పుడు కమలహాసన్ సరసన నటించే స్థాయికి చేరుకుందన్నారు. తాను నటించిన హీరోల నుంచి ఏదో మంచి విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నానన్నారు. సినీ రంగంలో సమంత, తమన్నాలతో చాలా సన్నిహితంగా ఉంటానని, చాలా విషయాలు వారితో పంచుకుంటానని చెప్పారు. తాను గత పదేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యానని ఆ తర్వాత తమిళ ప్రేక్షకులు ఆదరించారని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: శివ జ్యోతిని అక్కా.. అంటూనే ఇలాంటి కామెంట్లా?)
ముంబైకి చెందిన తాను డిగ్రీ చదివానని అలా మోడలింగ్ చేస్తున్న తనకు సినిమా రంగం తలుపు తెరిచిందని చెప్పారు. దాంతో చదువు కట్ అయిందని అన్నారు. తన తండ్రి వినయ్ అగర్వాల్ వ్యాపారి అని చెప్పారు. ఇప్పుడు తన సినిమా వ్యవహారాలన్నీ ఆమ్మనే చూసుకుంటున్నారని చెప్పారు. ఇకపోతే పెళ్లయిన తర్వాత తల్లిదండ్రులను వదిలి వచ్చాననే భావన కొంచెం కూడా రాకుండా భర్త చూసుకుంటున్నారన్నారు. సినిమాలతో పాటు నిజజీవితంలో భార్య, తల్లి పాత్రలకు సమన్వయం చేస్తున్నాననే సంతృప్తితో ఉన్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment